ప్రణబ్ ముఖర్జీ.. 2020 ఆగస్టు 31న ఢిల్లీలో తుది శ్వాస విడవడం జరిగింది.ఆయనకి అప్పటికి 84సంవత్సరాలు. ఇక ప్రణబ్ ముఖర్జీ డిసెంబర్ 11-1935 న పశ్చిమ బెంగాల్లోని విరాట్ ఈ గ్రామంలో ఒక బ్రాహ్మణ. కుటుంబంలో జన్మించారు. ఈయన తండ్రి కమథ కింకర ముఖర్జీ, భారత స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. ఈయన కూడా పశ్చిమ బెంగాల్ లోని కాంగ్రెస్ పార్టీ లో పని చేశారు. ఇక ప్రణబ్ ముఖర్జీ భారతదేశానికి 2012 నుండి 2017 వరకు 13వ రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహించారు.

తన ఆరు దశాబ్దాల రాజకీయ జీవితంలో అతను భారతీయ జాతీయ కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడిగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలో కూడా అనేక మంత్రిత్వ పదవులలో కూడా వ్యవహరించారు. రాష్ట్రపతిగా ఎన్నిక కాకముందు ప్రణబ్ముఖర్జీ కేంద్ర ఆర్థిక మంత్రిగా 2009 నుంచి 2012 వరకు  తన సేవలను అందించారు. పార్టీలతో సంబంధం లేకుండా ప్రణబ్ముఖర్జీకి రాజకీయ వర్గాలలో ఎంతో గొప్ప పేరుంది. మేధావిగా ట్రబుల్ షూటర్గా ఆయనకెవరూ సాటి రారాని అని చెప్పవచ్చు.


ప్రణబ్ ముఖర్జీ 1969 లో జరిగిన కాంగ్రెస్ సభలో అతను బంగ్లా కాంగ్రెస్ ప్రతినిధిగా ప్రసంగించారు. ఆ ప్రసంగం విన్న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ, మంత్రముగ్దురాలైపోయింది. ఇక తన తండ్రి కూడా కాంగ్రెస్ పార్టీలో పని చేశారని విషయం తెలుసుకొని ప్రణబ్ ముఖర్జీని ఒక సంవత్సరంలోనే కాంగ్రెస్ లో సభ్యుడు అయ్యే అవకాశం కల్పించింది. 1973లో కేంద్రం లోకి అడుగుపెట్టాడు. 1973లో కేంద్ర క్యాబినెట్ లోకి అడుగు పెట్ట గా నెహ్రూ కుటుంబంలోని మూడు తరాల నేతలకు సన్నిహితుడయ్యాడు. అయితే రాజీవ్ గాంధీ హయాంలో కాస్త పార్టీ నుంచి దూరం అయ్యాడు. రాజీవ్ గాంధీని ఏమాత్రం పార్టీలోకి రావడం ఇష్టం లేదు ప్రణబ్ ముఖర్జీకి. అందుకు కారణం ఆయనకు అనుభవం లేక అని తెలియజేశారు.దాంతో ఆయన సొంత పార్టీ పెట్టినట్లు సమాచారం.

ఇక ఆ తర్వాత 1989 లో రాజీవ్ గాంధీ తో ఒప్పందం కుదుర్చుకొని తన పార్టీని విలీనం చేశారు. ఇక ఈ విషయంలో ని రాజీవ్ గాంధీ తో గొడవ పడినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: