ఓవైపు క‌రోనా విజృంభిస్తుంటే మ‌రోవైపు మందు బాబులు అష్ట‌క‌ష్టాలు ప‌డుతున్నారు. లాక్డౌన్ విధించిడంతో రెండు మూడు గంట‌లే షాపులు తెర‌వాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించ‌డంతో ఆ సమ‌యంలో వైన్్స ముందు బారులు తీరుతున్నారు. దాంతో సామాజిక దూరాన్ని గాలికి వ‌దిలేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో లాక్ డౌన్ విధించినా క‌రోనా కేసులు మాత్రం పెరిగేలా క‌నిపిస్తున్నాయి. దాంతో ఒరిస్సాలోని ఖుర్దా జిల్లా అధికారులు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. మందు బాబుల‌ను క‌ష్ట పెట్ట‌కుండా..క‌రోనా కేసులు పెర‌గ‌కుండా మంచి నిర్ణ‌యం తీసుకున్నారు. ఇక పై మ‌ద్యాన్ని హోం డెలివ‌రీ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఈ రోజు సోమ‌వారం నుండే ఆన్లైన్ లో మ‌ద్యం అమ్మకాలను ప్రారంభిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అబ్కారీ విభాగం మార్గదర్శకాల మేరకు జిల్లా కలెక్టర్ల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఆన్‌లైన్‌ మద్యం విక్రయాలు చేపట్టాల‌ని నిర్న‌యం తీసుకున్నారు. 

ఇప్ప‌టికే మ‌ద్యం హోం డెలివ‌రీ కోసం జొమాటో, స్విగ్గీ తో పాటు 17 హోం డెలివరీ సంస్థలతో అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు. అంతే కాకుండా దానికోసం ఒక ప్ర‌త్యేక‌మైన వెబ్ సైట్ ను కూడా ఏర్పాటు చేశారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు  orbc.co.in అనే వెబ్‌సైటులో మద్యం బుకింగ్‌ చేసుకునేందుకు వీలు కల్పించారు. అంతే కాకుండా బుకింగ్ చేసుకున్న ఒక‌టి రెండు గంటల్లో మ‌ద్యం డెలివ‌రీ డెలివ‌రీ చేస్తామ‌ని అధికారులు పేర్కొన్నారు. ఖుర్దా జిల్లా అధికారులు తీసుకున్న నిర్ణ‌యంతో మందుబాబుల‌కు పెగ్గు వేయ‌కుండానే కిక్కినంత ప‌నైంది. ఇక పై లైన్ లో నిల‌డాల్సిన పనిలేకుండా ఇంటికే మ‌ద్యం వ‌స్తుంద‌ని కుషీ అవుతున్నారు. అంతే కాకుండా రోజంతా స‌మ‌యం ఉండ‌టంతో ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగొచ్చొని అనుకుంటున్నారు. ఇదిలా ఉండ‌గా హోం డెలివ‌రీ కోసం అధికారులు స‌ర్వీస్ ఛార్జీలు కూడా వ‌డ్డిస్తున్నారు. వెయ్యి వ‌ర‌కు మద్యం కొనుగోలు చేస్తే స‌ర్వీస్ ఛార్జీ రూ.100 కాగా తీసుకున్న మ‌ద్యాన్ని బ‌ట్టి స‌ర్వీస్ ఛార్జీ పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: