సాధారణంగా జంతుప్రదర్శన శాల కు వెళ్ళినప్పుడు కొంతమంది జంతువులను ఆట పట్టించేందుకు సరదాగా కొన్ని పనులు చేస్తుంటారు. అయితే ఇలా జంతువులను ఆట పట్టించేందుకు చేసే కొన్ని రకాల పనులు మాత్రం కొన్ని సార్లు ప్రమాదాలకు కారణం అవుతూ ఉంటాయ్ అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఇలా సరదాగా ఆట పట్టించే పనులు కొన్ని సార్లు జంతువులకు కోపం తెప్పిస్తుంది. చివరికి జంతువులు పర్యాటకులపై దాడి చేయడం లాంటి ఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఏకంగా ఒక సింహం వేలు కొరికేసింది. పర్యాటకుల పై దాడి చేయలేదు కానీ ఏకంగా జూ లో పనిచేస్తున్న సిబ్బందిలో ఒక వ్యక్తి వేలు కొరికింది. ఈ ఘటన జమైకాలో వెలుగులోకి వచ్చింది.


 జమైకా లోని జంతు ప్రదర్శన శాలలో ఒక జూ కీపర్  అత్యుత్సాహం ప్రదర్శించాడు. సింహం కంచె లోపల ఉంది.  కాగా తన వేలును ఇక కంచె నుంచి లోపలికి దూర్చి అటు సింహాన్ని ఆటపట్టిస్తూ ఉన్నాడు. సింహం మాత్రం కోపంతో గర్జిస్తూ ఉన్నది. ఇంతలోనే ఊహించని ఘటన. ఏకంగా అతని వేలిని నోట్లో పట్టేసింది ఆ సింహం. ఇక మృగరాజు అన్న తర్వాత ఊరుకుంటాడా వేలు తెగిపడేంత వరకు కూడా అలాగే నోటా కరిచింది. అతను వేలిని సింహం నోటి నుంచి విడిపించేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.  చివరికి ఉంగరపువేలు అని పూర్తిగా కోల్పోయాడు.


 ఇక ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది అని చెప్పాలి. ఇక ఆన్లైన్లో వైరల్ గా మారిపోయింది ఈ వీడియో.  అయితే ఇలా సింహం జూ కీపర్ వేలు కొరికితే  ఇది  ఒక జోక్ అనుకున్నారు పక్కనే ఉన్న పర్యాటకులు. ఇక ఎప్పుడైతే ఆ వ్యక్తి నేలపై పడి పోయాడో అప్పుడు పరిస్థితి తీవ్రం అయింది అని అర్థం చేసుకున్నారు. అయితే ఇలా సింహం అతని వేలు నోటకరిచినా సమయంలో పక్కనే ఉన్న పర్యాటకులు విడిపించేందుకు  ప్రయత్నించకుండా సెల్ ఫోన్ లో వీడియోలు తీయడం గమనార్హం. ట్విట్టర్ లో ఈ వీడియో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: