సాధారణం గా ద్విచక్ర వాహనంపై ఎక్కడికైనా వెళ్తున్న సమయం లో ఊహించిన విధం గా మార్గ మధ్యమం లో ఎక్కడైనా వాహనం ఆగి పోయింది అంటే ఇక మరో వాహనంపై ఉన్న స్నేహితులు ఇక ఇలా ఆగిపోయిన వాహనంపై ఉన్న వ్యక్తి చేతును పట్టుకుని ఇక బైక్ను ముందుకు లాగడం లాంటివి చేస్తూ ఉంటారు. లేదంటే వెనకనుంచి కాలితో నెట్టడం లాంటివి చేసి కొంత దూరం వరకు తీసుకువెళ్లడం లాంటివి ఇప్పటివరకు చాలానే చూసాం. కొంతమంది చేసి కూడా ఉంటారు.


 కానీ కారుని ఇలా తీసుకువెళ్లడం మాత్రం దాదాపు అసాధ్యమని చెప్పాలి   ఒకవేళ కారు ఆగిపోయింది అంటే మరో భారీ వాహనంతో కారుకు తాడు కట్టి మాత్రమే లాక్కెళ్లడానికి అవకాశం ఉంటుంది.  కానీ ఇలా బైక్ ని తీసుకెళ్లినట్లుగానే ఏకంగా ఒక కారుని పెట్టి నెట్టుతు తీసుకువెళ్లడం అనేది అసాధ్యమని చెప్పాలి. కానీ ఇటీవలే అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ ఏకంగా ఒక బెంజ్ కారుని ఆటో డ్రైవర్ కాలుతో ముందుకు నడిపించడం కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా తెగ చక్కర్లు కొడుతుంది అని చెప్పాలి.


 ఒక ఆటో డ్రైవర్ ఏకంగా ఒకవైపు ఆటో నడుపుతూనే మరోవైపు తన ఒంటికాలతో మెర్సడేస్ బెంజ్ కారును నెడుతూ మెకానిక్ షెడ్ వరకు చేర్చాడు. ఇది చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు అని చెప్పాలి. అయితే ఇక వారి వెనుక వాహనాలపై ఉన్నవారు కొంతమంది దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారిపోయింది. మహారాష్ట్రలోని పూణేలో ఈ ఘటన జరిగింది అన్నది తెలుస్తుంది. కారు ఆగిపోతే ఇలా కూడా ముందుకు నెట్టవచ్చా.. ఆ ఆటో డ్రైవర్ అందరికీ సరికొత్త ట్రిక్ నేర్పించాడు అంటూ నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: