ఇక లోకల్ ట్రైన్ అన్నాకా చాలా రకాల మనుషులు జర్నీ చేస్తుంటారు. వివిధ పనుల కోసం వెళ్లే వారు లోకల్ రైళ్లను ఎక్కువగా ఆశ్రయిస్తుంటారు. ఇవి పబ్లిక్ అసెట్ కాబట్టి వాటిని నీట్ గా ఉంచుకోవడం ఇంకా అలాగే తోటి ప్రయాణికులతో సామరస్యంగా మెలగడం చాలా ముఖ్యం.అయితే మనం చాలా సార్లు గమనిస్తూనీ ఉంటాం.ట్రైన్‌లో ప్రయాణించేటప్పుడు ఎదురు సీటు ఖాళీగా ఉంటే వెంటనే కాళ్లు దానిపై పెట్టేస్తారు కొంతమంది వేస్ట్ గాళ్ళు. అలా చేయడం సరికాదని చెప్పినా ఆ పనికిమాలిన వాళ్ళు వినరు సరికదా..తిరిగి రివర్స్‌లో మాటలతో దాడికి దిగుతారు. సరిగ్గా అదే జరిగింది ఇక్కడ కూడా. ఇక అందుకు సంబంధించిన వీడియోను కూడా ఓ ప్రయాణికుడు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయడంతో అది బాగా చక్కర్లు కొడుతూ ఇప్పుడు తెగ వైరల్‌గా మారింది. ముంబై లోకల్ ట్రైన్‌లో ఇద్దరు ప్రయాణీకులు తోటి ప్రయాణికుడి పట్ల చాలా అంటే చాలా దురుసుగా ప్రవర్తించారు. స్నేహితుడితో కలిసి లోకల్‌ ట్రైన్‌లో ప్రయాణిస్తున్న ఓ పనికిమాలిన యువతి తనకు ఎదురుగా ఉన్న సీటుపై సెన్స్ లేకుండా కాలు పెట్టి కూర్చుంది. 


ఇక ఆమె కాళ్లు పెట్టిన సీటులోనే ప్రశాంత్ అనే ఓ యువకుడు కూర్చుని ఉన్నాడు. అతను ఎంతో మర్యాదగా ఆమెను కాలు తీయాలని కోరాడు. అందుకు ఆ యువతి ఇంకా ఆమె స్నేహితుడు నిరాకరించారు.ఇక దానికి ఆమె..ఇది మా యిష్టం.. అసలు నువ్వెవరు అడగటానికి.. మేము లాయర్లం తెలుసా అంటూ అతన్ని బెదిరించింది. ఈ వైరల్ వీడియోను ఫొటో జర్నలిస్ట్ ప్రసాద్ ట్విట్టర్‌లో షేర్ చేయడంతో పాటు ముంబై పోలీసులు ఇంకా అలాగే రైల్వే అధికారులను ట్యాగ్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన ముంబై పోలీసులు కామెంట్స్ సెక్షన్లో ముంబై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌ను కూడా ట్యాగ్ చేశారు.వైరల్ అవుతున్న ఈ వీడియోని చూసి ఆ యువతి తీరుపై నెటిజన్లు ఎంతగానో మండిపడుతున్నారు. ఆ యువతి తీరు అస్సలు సరికాదని, వీరిని ట్రైన్‌లో ప్రయాణించకుండా నిషేధించాలని నెటిజన్స్ ఓ రేంజిలో మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: