ఇటీవల కాలం 
లో కొంత మంది జనాలు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ మూగజీవాలను ఇబ్బంది పెడుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తూ ఉన్నాయ్ అన్న విషయం తెలిసిందే. ఏకంగా సోషల్ మీడియాలో పాపులారిటీ కావడం కోసం పిచ్చి పనులు చేస్తూ ఉండటం కూడా నేటి రోజుల్లో చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇటీవల కాలంలో అయితే ఏకంగా ఆ నెమలి గుడ్లను దొంగలించాలని ఎంతోమంది ప్రయత్నించడం లాంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలానే వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి.



 పక్షులే కదా ఏం చేస్తాయి అనుకునే ఎంతోమంది ఇలా నెమలి గుడ్లను దొంగలించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఏకంగా నెమళ్లు అక్కడికి వచ్చిన మనుషులపై దాడులకు పాల్పడుతున్న వీడియోలు కూడా వైరల్ గా మారిపోతున్నాయి. ఇక ఇప్పుడు ఇలాంటిదే జరిగింది అని చెప్పాలి. ఒక నెమలి చెట్టుపై ఉన్న తన గూడులో గుడ్లు పెట్టింది. ఆహారం కోసం చుట్టుపక్కల తిరుగుతూ ఎప్పటికప్పుడు తన గుడ్లు కు కాపలా కాస్తూనే ఉంది ఆ నెమలి.



 ఇలాంటి సమయంలోనే ఆ గుడ్లపై కన్నేసారు ఇద్దరు మహిళలు. ఎట్టి పరిస్థితుల్లో ఆ గుడ్లను దొంగలించాలని ప్రయత్నించారు. ఓ మహిళ చెట్టు ఎక్కి నెమలి గూడులో నుంచి గుడ్లు తీస్తూ కింద నిలబడి ఉన్న మహిళకు గుడ్లు అందించడం మొదలు పెట్టింది. అయితే ఇక చుట్టుపక్కలే తిరుగుతున్న నెమలి అక్కడ తన గుడ్లను దొంగలిస్తున్నారు అన్న విషయాన్ని పసిగట్టింది. దీంతో అక్కడికి దూసుకోవచ్చు చెట్టు మీద ఉన్న మహిళపై ఒక్కసారిగా దాడికి పాల్పడింది. ఇక కిందనే ఉండి ఇదంతా చూస్తున్న మహిళను కూడా నెమలి విడిచి పెట్టలేదు. ఒకసారిగా దాడి చేయడంతో ఆ మహిళ కింద పడిపోయింది. ఈ వీడియో ట్విటర్లో వైరల్ గా మారింది. పక్షుల ప్రైవసీని డిస్టర్బ్ చేస్తే పరిణామాలు ఇలాగే ఉంటాయి అని ఎంతోమంది కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: