క్రియేటివిటీ అనేది ఎవరి సొత్తు కాదు అని నిరూపించే వీడియోలు చాలానే సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతూ ఉంటాయి అని చెప్పాలి. ఎందుకంటే కొంతమంది అవసరాలను తీర్చుకునేందుకు వాడే క్రియేటివిటీ చూసి ప్రతి ఒక్కరు ముక్కున వేలేసుకుంటారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇటీవల కాలంలో కొంతమంది అవసరానికి తగ్గట్టుగా ఏకంగా సాధారణ సైకిల్ ను ఎలక్ట్రికల్ సైకిల్ గా మార్చడం లాంటివి చూస్తూ ఉంటాం. అయితే పెద్దగా చదువుకోకపోయినప్పటికీ వారి అవసరం వారితో వినూత్నమైన ఆవిష్కరణకు ప్రాణం పోసేలా చేస్తూ ఉంటుంది. అంతేకాదు ఇక డబ్బులు లేని వారు మట్టి కుండలో ఎయిర్ కూలర్ టేబుల్ ఫ్యాన్ తో ఏసీ చల్లదనం.. సైకిల్ ని బైక్ గా మార్చేసిన వీడియోలు కూడా చాలానే సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి. ఇక ఇలాంటివి చూసినప్పుడు ఇది నిజంగా సాధ్యమైనా అనే అనుమానం ప్రతి ఒక్కరిలో కలగకుండా మానదు అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఇక్కడ ఒక యువకుడి క్రియేటివిటీ చూసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు అని చెప్పాలి. ఏకంగా మంచాన్నే వెహికల్ గా మార్చుకున్నారు ఇద్దరు యువకులు. మంచానికి మూడు చక్రాలను అమర్చి ఇక కదిలే వాహనంగా మార్చేశారు. అంతే కాదు ఆ వాహనంపై కూర్చుని ఇద్దరు పెట్రోల్ పంపుకు రావడం కూడా ఈ వీడియోలో కనిపించింది. అయితే వాళ్ళు ఇలా మంచాన్ని వాహనంగా మార్చుకొని నడుపుతూ ఉంటే రోడ్డుపై ఉన్న మిగతా వాహనదారులందరూ కూడా ఒక్కసారిగా ఆ వాహనాన్ని విచిత్రంగా చూడటం మొదలుపెట్టారు. దీంతో వెంటనే జేబులో ఉన్న ఫోన్ తీసి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇది కాస్త వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఏదేమైనా ఇది చూసి ఇదెక్కడి క్రియేటివిటీ రా బాబు అంటూ నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: