
ఒక వారం రోజుల క్రితం సోషల్ మిడిల్ లో అప్లోడ్ అయినా ఒక వీడియోలో ఒక స్విగ్య్ డెలివరీ ఏజెంట్ ఒక టీ కొట్టు దగ్గర కూర్చొని టీ తాగుతూ, బిస్కెట్స్ తింటూ కనిపిస్తాడు. ఈ ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి ద్రుష్టి ఈ వీడియో పైనే ఉంది. ఈ వీడియో ని ఇప్పటివరకు 30 లక్షల మంది చూసారు. చూసిన ప్రతిఒక్కరు తమ తమ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు.
మనం ఆన్లైన్ లో ఆర్డర్ చేసే ఫుడ్ ని మనకు అందించే డెలివరీ బాయ్స్ పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో చాలామందికి తెలియదు. మన కడుపు నింపడానికి వారు ఎండనక, వాననకా, రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతుంటారు. మన భోజనం మనకు సిరిన సమయానికి అందించడానికి వాళ్ళు పస్తులుంటారు. గతంలో కూడా డెలివరీ బాయ్స్ పడే కష్టాలను వివరిస్తూ చాలా వీడియోలు వైరల్ అయ్యాయి. కానీ ప్రయోజనం లేదు. వారి పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. ప్రతీ మనిషి సాటి మనిషిని గౌరవించాలి. పొట్టకూటి కోసం కస్టపడి పని చేసే ప్రతి ఒక్క వ్యక్తికీ ఇది వర్తిస్తుంది. తమ కుటుంబాలను పోషించుకోవడం కోసం మనకు ఆహారాన్ని డెలివరీ చేసే డెలివరీ బాయ్స్ తమ భోజనం గురించి మర్చిపోయి ఎలా గంటలు తరబడి ఆకలితో ఉంటారో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది.