హైదరాబాద్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో వేల మందికి ఉపాధి కలిగిస్తున్న టాప్ నగరం హైదరాబాద్. పక్క రాష్ట్రలు నుంచి ఎన్నో వేల మంది హైదరాబాద్ కి వచ్చి ఉద్యోగాలు చేసుకుంటూ బ్రతుకుతున్నారు. అలాంటి మహా నగరంలో సామాన్యుడు బ్రతకాలంటే బెంబేలెత్తిపోతున్నాడు. దానికి కారణం ఖర్చులు. అందులోనూ ఇంటి అద్దెలు బాగా పెరిగిపోయాయి. కేవలం హైదరాబాద్ నగరంలోనే కాదు…నగర శివార్లలో కూడా ఇదే పరిస్థితి. విద్యాసంస్థలు, ఐటీ కంపెనీలు, ఆస్పత్రులు ఇంకా ప్రైవేట్ కంపెనీలకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో అద్దె ఇళ్లకు డిమాండ్‌ అనేది బాగా పెరిగింది.కరోనా టైంలో ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఉండడంతో చాలామంది కూడా తమ సొంత ఉళ్ళకు వెళ్లిపోయారు. దీంతో నగరంలో చాలా వరకు కూడా టూలెట్ బోర్డులు కనిపించేవి. అయితే ఆ తర్వాత ఉద్యోగులు తిరిగి ఆఫీసులకు వెళుతున్నారు. దీంతో ఐటీ ఆఫీసులకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లోని అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీలు ఇంకా ఇండిపెండెంట్ హౌస్‌లు హాట్ కేకుల్లా మారాయి.


ఇక కరోనా మహమ్మారీ తర్వాత ఇంటి అద్దెలు కొన్నిచోట్ల బాగా రెట్టింపు అయ్యాయి. గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్ ఇంకా కూకట్‌పల్లి ప్రాంతాల్లో ఇంటి అద్దెలు ఆరు నెలల కాలంలో ఏకంగా 15 శాతానికి పైగా పెరిగాయి. బేగంపేట్, ప్రకాష్ నగర్,సోమాజిగూడ, పంజాగుట్ట బోయిన్పల్లి,మారేడుపల్లి ఇంకా అల్వాల్ ప్రాంతాల్లో అయితే ఏకంగా 20 నుండి 25శాతం అద్దెలు పెరిగాయి. ఎప్పటికప్పుడు పెరుగుతున్న ఈ ఇంటి అద్దెలు సామాన్యుల నడ్డిని ఘోరంగా విరుస్తున్నాయి. జీతాలు తప్ప అన్ని పెరుగుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేసే సగటు సామాన్యుడు…ఈ రెంట్‌ షాక్ తట్టుకోలేక శివారు ప్రాంతాలకు వెళితే…అక్కడ కూడా అద్దెలు పెంచేస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది.కొన్ని ప్రాంతాల్లో ఇంటి రెంట్లు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మొదటి మూడు నెలల కాలంలోనే ఏకంగా పది నుంచి పదిహేను శాతం పైగా పెరిగాయి. గతంలో కేవలం 10, 15 వేలకు నగరంలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అద్దెకు లభించేవి కానీ ఇప్పుడు మాత్రం 20 నుంచి 25 వేల పైగా ఖర్చు చేస్తే కానీ దొరకని పరిస్థితి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: