ఈ మధ్యకాలంలో ప్రతిదీ కల్తీ అయిపోయింది.  తినే తిండి దగ్గర నుంచి ముఖానికి రాసుకునే క్రీమ్స్ నుంచి ఒకటా రెండా ఉదయం లేచిన మొదలు రాత్రి పడుకునే వరకు మనం చేసే ప్రతి విషయంలోను కల్తి ఎక్కువగా ఉంటుంది . అన్నం తినాలంటే బియ్యంలో కల్తి.. కూర వండుకోవాలంటే కాయగూరల్లో కల్తి.. నూనెలో కల్తి.. కూరల్లో వాడే పొడులల్లో కల్తీ .. ఎక్కడ చూసినా కల్తీ కల్తీ కల్తీ.  ఇప్పుడు అంతా కల్తీ యుగం లా మారిపోయింది. కాగా  కేవలం మనుషులకే కాదు దేవుడికి కూడా అలాంటి ఒక పరిస్థితి వచ్చేసింది .


కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి పుణ్యక్షేత్రంలో తాజాగా జరిగిన ఒక ఇన్సిడెంట్ అందరికీ కోపం తెప్పిస్తుంది . దేవుడికి కూడా ఈ విధంగా చేస్తారా..? అంటూ మండిపడుతున్నారు భక్తులు . కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి పుణ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా చాలా పేరుగాంచింది . ఇక్కడ స్వయంభుగా కొలువైన గణపతిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున  వస్తూ ఉంటారు.  ప్రస్తుతం అక్కడ అధికారులు కాంట్రాక్టర్లు తీరు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చి పెట్టింది . తాజాగా ఆలయ మూల విరాట్ పరిస్థితి వినాయక స్వామి వారికి క్షీరాభిషేకం చేసేందుకు భక్తులు  టోకెన్ తీసుకున్నారు .



అంతా హ్యాపీగా జరిగిపోయింది ఇంకొంచెం సేపట్లో పాలాభిషేకం జరగబోతుంది అని భక్తులు భక్తి పార్వశ్యంతో ఆనందించే లోపే జరగరానిది జరిగిపోయింది . అభిషేకానికి పాలు సప్లై చేసే కాంట్రాక్టర్ భక్తులకు పాలు ఇవ్వగా అవి విరిగిపోయాయి . దుర్వాసన వస్తున్నాయి.  దీంతో వారు పాడైపోయిన పాలతో స్వామి వారికి అభిషేకం చేయడం ఏంటి ..?? అని  ప్రశ్నించారు . ఏం కాదు దేవుడికే కదా అని సలహాలు కూడా ఇచ్చారట . ఆ కారణంగా భక్తులు మండి పడిపోతున్నారు. మనుషులకి విలువ ఇవ్వట్లేదు దేవుడికి కూడా విలువ ఇవ్వడం లేదా ..? విరిగిపోయిన పాలతో పాలాభిషేకం నా..? ఏం మనుషులురా మీరు అంటూ సోషల్ మీడియాలో భక్తులు ఘాటుగా కామెంట్స్ పెడుతున్నారు . ఎప్పటినుంచి ఇలా జరుగుతుంది అని అడగ్గా పొంతనలేని సమాధానం చెబుతున్నారు . ఈ విషయాన్ని పై అధికారులు దృష్టికి తీసుకెళ్లగా వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో భక్తులు మండిపడుతున్నారు . ఇప్పటికైనా ఇలాంటి వి జరగకుండా చూసుకుంటే మంచిది అంటూ సూచిస్తున్నారు . కొంతమంది అయ్యో దేవుడా నీకు కూడా ఇలాంటి దుస్థితి వచ్చిందా ..? అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ పెడుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: