
అయితే, ఇతర రాష్ట్రాల వినియోగం తో పోలిస్తే ఇంకా తక్కువగా ఉన్నట్లే. దేశంలో అత్యధికంగా త్రిపుర 27.62 కేజీలు, తర్వాత కర్ణాటక 20.72 కేజీలు, కేరళ 20.65 కేజీలు, మణిపూర్ 18.25 కేజీలు, ఒడిశా 17.73 కేజీలు సరిపడుతున్నాయి. రిపోర్ట్‌లో పశ్చిమ బెంగాల్ పై కూడా ఆసక్తికర అంశాన్ని వెల్లడించింది. పశ్చిమ బెంగాల్‌లో చేపల సగటు వినియోగం 15.11 కేజీలు మాత్రమే, ఇది జాతీయ సగటు కంటే కేవలం 2 కేజీలే ఎక్కువ. త్రిపురతో పోలిస్తే దాదాపు 12.5 కేజీలు తక్కువగా ఉంది. తెలుగోళ్లలో మహిళలు పురుషుల కంటే చేపలను తక్కువగా తింటారు. విందులు, ఉత్సవ విందుల్లో కూడా తెలుగు రాష్ట్రాల్లో చేపల వంటలు ఎక్కువగా కనిపించవు. రిపోర్ట్ ప్రకారం, పలు ప్రాంతాల్లో చేపలు పెద్దగా దొరక్కపోవడం, వాటిని క్లీన్ చేయడంలో ఉన్న సవాళ్లు కారణంగా విందులలో చేప వినియోగం తక్కువగా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది వారానికి ఒక్కసారి మాత్రమే చేపలను తింటారు, రోజువారీగా తినే వారు చాలా తక్కువగా ఉన్నారు. అయితే రాబోయే కాలంలో చేపల వినియోగం పెరుగుతుందని అంచనా. 2030 నాటికి సగటు 19.8 కేజీలు, 2048 నాటికి 41 కేజీలకు పైగా చేరుతుందని రిపోర్ట్ భావిస్తోంది. రాష్ట్రాల్లో కేరళలో రోజువారీగా చేపలు తినే వారు 53.5% తో ముందు, గోవా *36.2%* తో రెండో స్థానంలో నిలిచింది. మొత్తానికి, తెలుగోళ్లు నాన్ వెజ్‌లో అత్యుత్తమ రికార్డులు సాధించినప్పటికీ, చేపల విషయంలో మాత్రం వెనకబడుతున్నారు. భవిష్యత్తులో అందులో మార్పు వస్తుందని, అందరూ చేపల రుచిని ఆస్వాదిస్తారని అంచనా.