 
                                
                                
                                
                            
                        
                        ఇలాంటి చర్యల వల్ల అసలు ఆ చట్టం ఉద్దేశం పూర్తిగా వక్రీకరించబడుతోంది. నిజంగా బాధపడుతున్న మహిళలు న్యాయం కోసం పోరాడుతున్నప్పటికీ, కొంతమంది ఈ చట్టాన్ని స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవడం వల్ల మొత్తం వ్యవస్థపై ప్రజల్లో అపనమ్మకం పెరుగుతోంది. భరణం చట్టం మహిళలకు రక్షణగా ఉండాలే కానీ దాన్ని దుర్వినియోగం చేసే ఆయుధంగా మారకూడదు. తాజాగా ఒక కేసులో ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వివరాల్లోకి వెళ్తే — ఒక మహిళ తన భర్తను వదిలి, విడిగా ఉంటోంది. భర్త వ్యాపారం చేస్తుండగా, ఆమె కోర్టులో భరణం కోసం పిటిషన్ వేసింది. అయితే విచారణలో బయటపడిన వివరాలు ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరిచాయి.
అసలు ఆ మహిళకే తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఇల్లు, స్థలాలు, స్థిరాస్తులు, రెంటల్ ఇన్‌కమ్ లాంటి వాటి ద్వారా నెలకు తగినంత ఆదాయం వస్తోందని కోర్టు గమనించింది. అదేవిధంగా, ఆమెకు బ్యాంక్ ఖాతాల్లో పెద్ద మొత్తంలో డిపాజిట్లు ఉన్నాయని కూడా రికార్డుల్లో తేలింది. ఈ నేపథ్యంలో కోర్టు ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది. “తమకు స్వంతంగా ఆస్తులు, స్థిరమైన ఆదాయం ఉన్న మహిళలు భర్త నుంచి భరణం డిమాండ్ చేయలేరు. భర్తపై అదనపు ఆర్థిక భారం మోపడం సరికాదు. భరణం అనే హక్కు, ఆర్థికంగా ఆధారపడే మహిళలకే వర్తిస్తుంది.” ఈ తీర్పుతో ఆ మహిళకు భరణం మంజూరు చేయడాన్ని కోర్టు స్పష్టంగా తిరస్కరించింది. దీంతో, భార్యకు ఆస్తి ఉంటే భరణం ఇవ్వనవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది.ఈ తీర్పు వెలువడిన తర్వాత న్యాయవర్గాల్లో పెద్ద చర్చ మొదలైంది. చాలా మంది దీనిని “ప్రజ్ఞాపూర్వకమైన, సమతుల్య నిర్ణయం”గా అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే, గతంలో చాలా కేసుల్లో ఆర్థికంగా బలంగా ఉన్న భార్యలు కూడా భర్తపై భరణం కోసమే కేసులు వేసేవారని, దీని వల్ల అనేక మంది పురుషులు అన్యాయంగా భారాలు మోసేవారని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
ఇకపోతే, ఈ తీర్పు భవిష్యత్తులో భరణం కేసుల తీర్పులపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉందని లాయర్లు విశ్లేషిస్తున్నారు. మొత్తానికి — “భార్యకీ ఆస్తి ఉంటే భరణం అవసరం లేదు” అనే తీర్పుతో కోర్టు ఒక కొత్త మైలురాయిని సృష్టించింది అని చెప్పుకోవాలి.
 
             
                             
                                     
                                             క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి
 క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి