మెహరీన్  పిర్జాదా..అనే పేరు వినగానే గుర్తుకు వచ్చే సినిమా పేరు కృష్ణగాడి వీరప్రేమగాథ చిత్రం. అయితే ఇదే ఈమె తెలుగులో నటించిన మొట్ట మొదటి సినిమా... ఈ భామ ఇండస్ట్రీకి వచ్చిన అనతికాలంలోనే పేరు ప్రఖ్యాతలు బాగా సంపాదించుకుంది.. వరుస అవకాశాలతో దూసుకుపోతుంది ఈ భామ. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఆరు సినిమాలున్నాయి. ఆమె ఎన్నో ముచ్చట్లని అభిమానులతో పంచుకుంటుందిలా...


ఏ వృత్తిలోనైనా రాణించాలంటే.. ప్రతిభతో పాటు కాస్త అదృష్టం కలిసిరావాలని, అయితే కేవలం లక్‌ను నమ్ముకొని ఉంటే సరిపోదు. అదే సమయంలో వృత్తిలో రాణించాలంటే ప్రతిభకు మెరుగులు దిద్దుకోవాలి. నేను వ్యక్తిగతంగా విధిని విశ్వసిస్తాను. మనకు రాసిపెట్టుంది మనకే దక్కుతుందని నమ్ముతాను. అయితే మన కలల్ని సాఫల్యం చేసుకోవాలంటే నిరంతర కృషి, తపనతో పనిచేయాలి. సరైనా సమయం కోసం నిరీక్షించే సహనం కూడా ఉండాలి.  


నేను కథ వినేటప్పుడే ఓ ప్రేక్షకురాలి దృష్టికోణం నుంచి ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని, నా పాత్ర చిత్రణలో అభినయానికి ఆస్కారం ఉంటేనే ఒప్పుకుంటాను. మొదటి నుంచే కథల ఎంపికలో నాకంటూ కొన్ని ప్రమాణాల్ని నిర్దేశించుకున్నానంటుంది ఈ భామ. మనసుకు నచ్చిన ఇతివృత్తాలనే ఎంచుకుంటున్నాను. F- 2 విజయం తర్వాత నాయికగా అవకాశాలు ఎక్కువయ్యాయని చెబుతున్నారు మెహరీన్. ఇప్పుడు నా డేట్స్ ఖాళీలేవు. వరుస సినిమాలతో బిజీగా ఉన్నాను. ఈ ఏడాది ఆరు సినిమాల్ని అంగీకరించాను. ఇప్పటికే రెండు చిత్రాలు రిలీజ్ అయ్యాయి. నాలుగు చిత్రీకరణ దశలో ఉన్నాయని తెలిపారు.
ట్రావెలింగ్‌ను నేను బాగా ఎంజాయ్ చేస్తాను. ఇంటి దగ్గర వుంటే మాత్రం డిజిటల్ ప్లాట్‌పామ్స్‌లో వచ్చే సినిమాలు, సిరీస్‌లు చూస్తాను. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతాను. నేను అమెరికాలో పుట్టాను. కొంతకాలం అక్కడే ఉన్నాను. అక్కడి అందమైన పర్యాటక ప్రదేశాలు చాలా ఇష్టం. యూరప్‌లో విహారాన్ని కూడా ఆస్వాదిస్తా. ఇప్పటికీ చాలా దేశాల్ని సందర్శించాను. దక్షిణాదిన అనుష్క, సమంత, తమన్నా అంటే బాగా ఇష్టం. హిందీలో కంగనారనౌత్‌ను స్ఫూర్తిగా తీసుకుంటాను. ఇక నా ఆల్‌టైమ్ ఫేవరేట్ కథానాయిక కాజోల్.


మరింత సమాచారం తెలుసుకోండి: