ప్రేమకు అర్థం తెలియాలంటే చూడాల్సింది నిఘంటువు కాదు, అమ్మ ముఖాన్ని. ప్రేమకు చిరునామా అమ్మ. మనల్ని కన్నందుకు అమ్మకి మన పాదాభివందనాలు. సృష్టిలో అమ్మకు మించిన దైవం లేదని అంటారు.  అమ్మ ఔదాత్త్యాన్ని, ప్రేమను వర్ణిస్తూ కవితలు, గేయాల రూపంలో తమ ప్రేమను చాటుకున్న వారెందరో ఉన్నారు సినీ సాహిత్యంలోనూ అమ్మపై ఎన్నో అద్భుతమైన పాటలు మనసును హత్తుకుంటాయి. కళ్లు చెమరింపజేస్తాయి. అమ్మదనం లోని కమ్మదనం, ఆహ్లాదం... ప్రకృతిలో సహజసిద్ధంగా లభ్యమయ్యే ఏ వనరుల నుండీ పొందలేము. తానిచ్చు పాలతో.... లాలించు పాటతో ఎంత ఎదిగినా ఆ తల్లికి పిల్లలు ఇంకా  చిన్న బిడ్డలే. మనసును సుతిమెత్తగా తాకుతుంది అమ్మ జోల పాట. అమ్మలో ఉన్న ప్రేమ భావము, బిడ్డలపై చూపే మమకారం  ప్రపంచంలో ఎవరి వద్దా చూడలేము.  ప్రపంచంలో దేశదేశాల్ని చుట్టి, లక్షలాది మందిని కలిసినా అమ్మ వంటి అపురూప వ్యక్తి ఎక్కడా కనిపించరు.

 

మనం  సంపాదించిందంతా ఆమె చరణాల వద్ద పోసినా కూడా  ఇంకా అమ్మకి బాకీ పడతాము. అమ్మ ఋణం మనం తీర్చుకోలేనిది. 
ప్రేమకు, మమతానురాగాలకు ప్రతిరూపం అమ్మ. త్యాగానికి నిదర్శనం అమ్మ.. అమ్మ ప్రేమ నిత్యనూతనం.అలాంటి అమ్మ వృద్ధాప్యంలో ఉంటే మనం చీదరించుకుంటున్నాము, అనరాని మాటలు అంటున్నాము. మనం గుర్తించాలిసిన విషయం ఏంటంటే  వృద్ధాప్యం అనేది  మరో పసితనం. చిన్నతనంలో మనం  గారాం చేసినపుడు మనల్ని అక్కున చేర్చుకున్నది మన అమ్మే.అలాగే వృద్ధాప్యంలో వారినీ అక్కున చేర్చుకోవడం మన కర్తవ్యం.  

 

మన ఒంట్లోని ప్రతి జీవకణం అమ్మ నుండి కోసుకొచ్చుకున్నదే.అందుకే అమ్మ ఓ విశ్వజనని,  ఓ మమతానురాగబంధం. ఆ బంధం ఒక్కరోజుకే పరిమితం కారాదు. వారికి సమాన గౌరవం ఇవ్వాలి. కుటుంబంలోనూ, సమాజంలోనూ సముచిత స్థానం కల్పించాలి. మనల్ని భూమి మీదకి తీసుకురడానికి తన ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి మరి మనల్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది అమ్మ.. మనకి ఒక రూపాన్ని ఇచ్చింది అమ్మ. అలాంటి అమ్మని ఒంటరిగా వదిలేయకండి. బ్రతికి ఉన్నన్నాళ్ళు ఆనందంగా చూసుకుందాం.. 

మరింత సమాచారం తెలుసుకోండి: