దేశవ్యాప్తంగా చలి ప్రారంభమైంది. ఈ శీతాకాలంలో వాతావరణం చల్లగా ఉండటంతో చర్మం త్వరగా పొడిబారిపోతుంది. తేమ సరిగా లేకపోవడంతో అనేక చర్మ సమస్యలు తలెత్తుతాయి. ఇక చర్మంతో పాటు చలికాలంలో జుట్టును కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అయితే ఈ కాలంలో చర్మం పొడిబారకుండా ఉండాలంటే శరీరానికి విటమిన్ ఇ ఎంతో అవసరం. విటమిన్ ఈ ఉన్న ఆహారం తీసుకుంటే చర్మ సమస్యలతో పాటు వృద్ధాప్య సంబంధిత లక్షణాల నుంచి కూడా రక్షించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు తెలిపారు.

ఇక పోషకాలు అత్యధికంగా కొలువున్న ఆహారపదార్థాల్లో బాదం ఒకటి. రాత్రి పూట 5 బాదం పప్పు గింజలను నానబెట్టి.. ఉదయం లేవగానే అల్పాహారం చేసే సమయంలో వాటిని తింటే ఎంతో ఉపయోగం ఉంటుందని నిపుణులు తెలిపారు. అయితే వాటిపై ఉండే తొక్కను తీసేసి తినాలని నిపుణులు సూచిస్తున్నారు. బాదంను అల్పాహారం తీసుకునే ముందు గానీ.. బెడ్ కాఫీ తాగేప్పుడు గానీ తీసుకోవచ్చు. ఇక గ్రీన్ లీవ్స్ లలో ఉండే పోషకాలు చాల ఎక్కవగా ఉంటాయి. బచ్చలి కూరను వండుకుని గానీ లేదా ఉడకబెట్టిగాని తినవచ్చు. ఆకు కూరలు జుట్టు ఆరోగ్యాన్ని కాపాడటంతో ఎంతో తోడ్పడుతాయి. అవకాడొ ఈ రుచికరమైన పండు అల్పాహారంలో సంచలనంగా మారింది. ఉదయం తీసుకునే గుడ్లు, పాలు, ఇతర ఉడకబెట్టిన కూరగాయల మాదిరే చాలా మంది అవకాడొను తీసుకుంటారు.

అయితే పొద్దుతిరుగుడు విత్తనాలలో విటమిన్ ఇ కంటెంట్ అధికంగా ఉంటుంది. కాల్చిన పొద్దు తిరుగుడు విత్తనాలను ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో గానీ.. టీ తాగిన తర్వాత గానీ తింటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దానితోపాటు ఓట్స్, తృణ ధాన్యాలు తినేవాళ్లు కూడా ఈ విత్తనాలను వాటితో కలిపి తినవచ్చు. వేరుశెనగలు లేకుండా ఉదయం పూట చేసే టిఫిన్లు తయారుకావంటే అతి శయోక్తి కాదేమో. ఉప్మా, పోహా, ఫ్రూట్ షేక్స్ లో వేరుశెనగలు ఉండాల్సిందే. వీటిని వేయించుకుని తిన్నా రుచికరంగానే ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: