మగవారితో సమానంగా ఆడవారికి సమానంగా అన్ని రంగాల్లో అవకాశాలు రావడం కోసం ఎన్నో ఏళ్ళ నుంచి పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ పోరాటాలు కృషి మూలంగా 2015 బిజెపి ప్రభుతం అధికారంలోకి వచ్చిన వెంటనే స్పెషల్ గా ఆడవారి కోసం ఒక పథకాన్ని తీసుకొచ్చింది. అదే 'భేటీ బచావో భేటీ పడావో' 2015 లో ఇది అమలులోకి వచ్చింది. కొన్ని ఫ్యామిలీస్ తమ ఇంట్లో మగ పిల్లలని ఒకలా, ఆడపిల్లలని ఒకలా చూస్తుంటారు. ఇది మారాలి. ఇక్కడ అందరు సమానమని విషయం మర్చిపోకూడదు. అందరిని సమానంగా చూడాలి. ఇంట్లో ఆడపిల్లలల్ని చదివించకుండా కేవలం మగ వారినే బడికి పంపించడం లాంటివి చేయకూడదు. విద్య అనే అందరికి ఒకటే. కాబట్టి ప్రధాని పథకం ప్రకారం ఆడపిల్లలు కూడా చదివించాలి అప్పుడే వాళ్ళు మగవారితో సమానంగా ఉద్యోగాలలో పోటీపడగలరు. ఉద్యోగాలను చేయగలరు.

ఇక అసలు విషయానికి వస్తే, మధ్యప్రదేశ్ కి చెందిన ఒక ఊరిలో వారి ఇళ్లకు ఆడపిల్లల పేర్లు రాసి ఉండటం మనం గమనించవచ్చు. ఇలా పేర్లు రాయడం వెనక ఒక మహిళ ఉండటం విశేషం. ఆపేరు మిషాసింగ్ షాజాపూర్ గ్రామపంచాయితీ అధికారిణిగా పనిచేస్తుంది.అయితే ఈమెకు వచ్చిన ఒక ఆలోచనే ఇప్పుడు ఆ గ్రామమంతా ఇళ్ల గోడలపై ఆడపిల్లల పేర్లు వచ్చి చేరాయి. ఇంతకీ ఆమె చేసింది ఏమిటంటే ఎవరికైతే ప్రధానమంత్రి ఆవాస యోజన కింద ఇల్లు మంజూరు అవుతుందో ఆ ఇంటిని ఆ ఇంటిని ఆడపిల్లల పేరుతో వారికీ అందజేస్తారు. అయితే మిషాసింగ్ 'భేటీ బచావో భేటీ పడావో' పథకాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో భాగంగా ఆ ఇల్లు మంజూరి అయిన వారికీ గుర్తుగా వారి ఆడపిల్ల యొక్క పేరునే ఆ ఇంటికి పెట్టి ఇస్తున్నారు.

ఈ విధంగా చేయడం వల్ల ఆ గ్రామమంతా ఏ ఇంటిని చూసిన ఆడబిడ్డల పేర్లతో ఆ ఇంటికే ఒక కళను తీసుకొచ్చిందని చెప్పుకోవాలి. తమ కూతుళ్ళ పేర్లను ఇంటికి పెట్టుకోడం మూలంగా ఆ ఆడపిల్లలను కన్న తల్లితండ్రులు గొప్పగా మరియు గర్వంగా ఫీల్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: