బిడ్డ అప్పటి నుంచి ఆరు మాసాల వరకు తల్లి పాలు ఇవ్వడం చాలా మంచిది. ఆ తర్వాత నుంచి కొద్దిగా ఆహారాన్ని అందించాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. అప్పుడు ఇచ్చే ఆహారం వారి మానసిక, శారీరక ఎదుగుదలకు నాంది. అందుకే ఎంతో జాగ్రత్తగా ఆహారాన్ని ఇవ్వాలి. ఎటువంటి ఆహారాన్ని ఇవ్వాలి. అనేది కొంతమందికి తెలియదు..అలాంటి వాళ్ళు ఈ ఆర్టికల్ ను ఒకసారి చదవండి.. మీకు తెలియనిది తెలుసుకోండి.

కీరాదోస..
ఇవి పిల్లలకు మాత్రమే కాదు పెద్ద వాళ్ళకు కూడా చాలా మంచిది. ఇందులో ఉండే నీటి శాతం ఎన్నో రొగాలను ఇట్టే నయం చేస్తుంది. ముఖ్యంగా పిల్లలకు మంచి ఆహారం.. తినడానికి సులువుగా వుంటుంది. పొషకాలు కూడా కాస్త ఎక్కువే..

పాలు..
వీటి గురించి ప్రత్యెకంగా చెప్పనక్కర్లేదు.. బిడ్డకు కావలసిన అన్నీ ఇందులో అందుతాయని నిపుణులు అంటున్నారు..కాల్షియం ఇందులో అధికంగా ఉంటుంది. ఎముకలు, పళ్ళు ఏర్పడడానికి సహాయపడతాయి. తల్లి పాలు ఇవి ఇవ్వడం చాలా మేలు. అయితే ఆరు మాసాల తర్వాత తొమ్మిదో నెల నుంచి పిల్లలకు కొద్ది కొద్దిగా పెరుగును అలవాటు చేయడం ఉత్తమం..

బ్రొకలి, క్యారెట్..
ఈ రెండు పిల్లలకు తప్పనిసరిగా ఇవ్వాలి.విటమిన్ సి, ఫైబర్ ఉంటాయి. మీరు శిశువుకు ఉడకబెట్టిన బ్రొకోలీని ఇవ్వడం బెస్ట్.. ఇకపోతే క్యారెట్.. ఇందులో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది.ఇవి రెండు కళ్ళకు చాలా మంచిది.. అలాగే చిలకడ దుంప కూడా చాలా మంచిది.
అరటి..
ఈ పండ్లలోని కాల్షియం, మెగ్నిషియం మొదలైన మూలకాలు బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం దొహద పడుతుంది.అరటిపండ్లతో పాటు మామిడి పండ్లు, స్ట్రాబెర్రీలను పెట్టడం చాలా మంచిది.
నాన్ వెజ్..
చికెన్, చేపలు వంటి వాటిని ఇవ్వడం చాలా మంచిది. యాంటీబయాటిక్ రహితంగా ఉంది. ఇక చేపలు కూడా తినిపించవచ్చు.. ఎన్నో సమస్యలను దూరం చేసి బేబి ఎదుగుదలకు సహాయం చేస్తుంది...

ఇంకా పప్పులు, డ్రై ఫ్రూట్స్, ఓట్స్,అవకాడో.. బచ్చలికూరతో మల్టీగ్రెయిన్ బ్రెడ్, ఖిచూరీ చేసి ఉప్మా చేసి బిడ్డకు తినిపించాలి. ముఖ్యంగా ఇక్కడ ఇంట్లో చెసినవి ఎక్కువగా పెట్టడం వల్ల మంచి లాభాలు ఉన్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: