దీపావళి పండుగ రోజు ఇంటిని దీపాలతో ఎంతో చక్కగా అలంకరిస్తారు. దానితో పాటు ఇంట్లో కొత్త బట్టలు వేసుకొని చక్కని పిండి వంటలు చేసుకొని మనసారా తింటారు.  అయితే చిన్న పిల్లల కోసం ప్రతిసారి ఒకే వంటలు కాకుండా కొత్త కొత్త వంటలు, కొత్త రకం స్వీట్లు తయారు చేసి ఇస్తే ఎంతో ఆనందంగా తింటారు.  దీపావళి స్పెషల్ గా క్యారెట్, బాదం బర్పీ ఎలా తయారు చేయాలో చూద్దామా..


కావాల్సిన పదార్ధాలు :

బాదం పప్పు - 1 కప్పు

పంచదార - 2 కప్పులు
వెన్న - అర కప్పు
క్యారెట్ - 2
యాలకుల పొడి - అర టీ స్పూను


తయారు చేయు విధానం : 

- దీన్ని తయారు చేయాలంటే ముందుగా బాదం పప్పును రాత్రి మొత్తం నానబెట్టాలి. తర్వాత దాని పొట్టుతీసేసి విడిగా ఉంచుకోవాలి.

- మరోపక్క క్యారెట్ ను కట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి
- తర్వాత బాదం, క్యారెట్ ముక్కలను కలిపి, పాలతో మిక్సీకి పట్టి మెత్తగా చేసుకోవాలి. 
- ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నెపెట్టి అందులో  బాదం మిశ్రమం , పంచదార, వెన్న వేసి ఉడికించాలి.  
- ఇలాచి పొడి చల్లి ప్లేట్ కి నెయ్యి రాసి క్యారెట్  బర్ఫీ ని వేసి చల్లారిన తర్వాత ముక్కలుగా కోసుకోవాలి. అంతే రుచికరమైన క్యారెట్ బాదం బర్ఫీ సిద్ధంగా ఉంటుంది
- దీనిని పండగలప్పుడే కాకుండా మామూలు సమయంలో కూడా చేసుకోవచ్చు. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు


మరింత సమాచారం తెలుసుకోండి: