మనం చాల వరకు విమానాలు, హెలికాప్టర్లు వంటి గాలిలో ఎగరడం చూశాం. అయితే మరికొద్దీ రోజుల్లో ఎగిరే కార్లు త్వరలో ప్రజల ఉపయోగం కోసం అందుబాటులోకి రానున్నాయని నిపుణులు తెలిపారు. ఈ కారు ఆటోమాటిక్ గా ఎగురుతుంది. ఈ ఎగిరే కారును ఏ పట్టణ ప్రాంతంలోనైనా ఉపయోగించవచ్చు. ఈ కారును ఉపయోగించడానికి ప్రత్యేక స్థలం అవసరం లేదని నిపుణులు తెలిపారు. ఇక త్వరలో ఈ కంపెనీ నుండి  ఫ్లయింగ్ కార్లు రానున్నట్లు చెప్పారు.

అయితే ఆస్ట్రో ఎల్రాయ్ చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ ఎగరటానికి అనుకూలంగా ఉంటుందని తెలిపారు.. ఈ ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కారులో ఒక ప్రయాణీకుడు మాత్రమే ప్రయాణించగలడు. ఈ ఫ్లయింగ్ కారు తక్కువ దూరం ప్రయాణించడానికి ఇష్టపడేవారి కోసం రూపొందించబడింది. ఈ కారు అల్ట్రాలైట్స్‌తో పనిచేస్తుందన్నారు. ఈ ఎగిరే కారు నడపడానికి పైలట్ లైసెన్స్ పొందవలసిన అవసరం కూడా లేదని తెలిపారు.

అంతేకాకుండా హోవర్‌సర్ఫ్ ప్రపంచంలో అత్యంత ఖరీదైన అధునాతనమైన కార్లలో ఒకటి. దుబాయ్ పోలీసుల దృష్టిని ఎక్కువగా ఆకర్షించిందని తెలిపారు. ఈ కారు విడుదలైన తర్వాత దుబాయ్ పోలీసు బలగాలలో కనిపించే అవకాశం ఉందన్నారు. ఇది EVTOL సర్టిఫికేట్ ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కారు. ఈ ఫ్లయింగ్ కారు విఐపిల ఉపయోగం కోసం ప్రత్యేకంగా రూపొందించబడిందన్నారు. ఇది చిన్న బైక్ లాగా పనిచేసే నిలువు టేకాఫ్ తీసుకుంటుంది. ఈ కారు చాలా దూరం ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుందని తెలిపారు.

ఇక డచ్ కంపెనీకి చెందిన ఈ ఫ్లయింగ్ కారు త్వరలో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంటుంది. మిల్క్-వి ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కార్లను భారతదేశంలో విడుదల చేయనున్నారు. ఈ కారును ఎగిరే కారుగా లేదా రోడ్ కారుగా ఉపయోగించవచ్చునన్నారు. ఈ కారులో ఇద్దరు ప్రయాణీకులు మాత్రమే ప్రయాణించగలరు. పైన పేర్కొన్న ఈ ఐదు ఎగిరే కార్లు త్వరలో ప్రజల ఉపయోగంలోకి వస్తాయన్నారు. వీటిలో కొన్ని కార్లు పర్యాటకుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడ్డాయని తెలిపారు. పాల్స్ వంటి ఎగిరే కార్లు వాణిజ్య ప్రజల ఉపయోగం కోసం విడుదల చేయబడతాయని నిపుణులు తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: