మార్కెట్ లోకి కొత్త రకమైన వాహనాలు వస్తే పాత వాటిని కనీసం పట్టించుకోను కూడా పట్టించుకోము.. అది యువత లక్షణం.. ఇక కార్లు మొదలైనప్పుడు వచ్చిన కార్లను అసలు చూడరు. అయితే కొందరు యువకులు ఆ కారులో షికారు చేస్తూ జనాల దృష్టిని ఆకర్షించిస్తున్నారు. ఒకసారి ఆ కారు వివరాలను తెలుసుకుందాం.. గతేడాది లాక్ డౌన్ తర్వాత చాలా దూరం పాటు ప్రయాణిస్తున్న బాట సారుల వీడియోలు చక్కర్లు కొట్టాయి. వారిలో కొందరు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ రోడ్ ట్రిప్ లో వెళ్తూ కనిపించారు. అయితే వారు ప్రయాణించడానికి ఎంచుకునే మార్గాలే డిఫరెంట్ గానూ.. ఆశ్చర్యకరంగానూ అనిపిస్తున్నాయి


కొందరు మోటార్ సైకిల్స్ వాడుతుంటే, మరి కొందరు కార్లతో తిరిగేస్తున్నారు. కేరళ నుంచి మనాలి వరకూ లేదా కశ్మీర్ వరకూ సైకిల్ మీద లేదా కాలి నడకన వెళ్లే వారూ ఉన్నారు. అయితే ఓ గ్రూపు ఇదే కాన్సెప్ట్ తో బయల్దేరింది. వారు ఎంచుకున్న ట్రాన్స్ పోర్ట్ వెహికల్ ఏంటో తెలుసా.. పాతికేళ్ల క్రితం వాడిన పాత మారుతీ 800. అదెలా అనుకుంటున్నారా..
వీళ్లు చేసిన ఫీట్ కు నేరుగా మారుతీ సుజుకీనే వాళ్లు యూట్యూబ్ ఛానెల్ లో వీడియో అప్ లోడ్ చేసకుంది.


కేరళలోని మలప్పురం జిల్లా నుంచి బయ ల్దేరిన వీరు.. లాక్ డౌన్ తర్వాత రోడ్ ట్రిప్ ఎలా చేశారనేది అందు లో ఉంది. మొత్తం 25 రాష్ట్రాల్లో 8వేల 500కి లోమీటర్ల పాటు ప్రయాణించారు: కొద్ది పాటి మాడిఫికేషన్స్ చేసి నలుగురు ఈ ప్రయాణం మొదలుపెట్టారు. ఆ స్టీల్ రిమ్స్ ను మార్చి అల్లోయ్ వీల్స్ గా.. లగేజ్ ర్యాక్ పెట్టుకుని, దానికి ముందు ఆగ్జిలరీ ల్యాంప్ తో ప్రయాణిస్తూ ఉన్నారు. అవి కాకుండా బయటి వైపు మార్పులెదు..ప్రయాణం బాగుంటుంది.. ప్రస్తుతం ఈ కారు ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: