ఇక అమెరికన్ కార్ బ్రాండ్ ఫోర్డ్ (Ford) ఇప్పటికే భారతదేశంలో తమ వాహనాల ఉత్పత్తిని నిలిపివేసిన సంగతి మనందరికీ కూడా తెలిసినదే. మన దేశంలో వస్తున్న వరుస నష్టాల కారణంగా, ఇకపై ఇక్కడ వ్యాపారం కొనసాగించడం కష్టమని, ఇక అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆ సమయంలో ఫోర్డ్ తెలిపింది. అయితే, ఆ తర్వాత ఫోర్డ్ ఇండియా ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయాలని ప్లాన్ చేసింది. మరి ఏం జరిగిందో ఏమో కానీ, ఇప్పుడు ఆ ప్లాన్స్ ను కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నట్లు ఈ అమెరికన్ కంపెనీ వెల్లడించింది.ఇండియాలో ఫోర్డ్ ఇండియా కొనసాగిస్తున్న వ్యాపార పునర్నిర్మాణంలో భాగంగా భారత ప్రభుత్వ ఉత్పత్తి లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం కోసం అప్లై చేసుకుంది. ఈ PLI ప్రణాళిక ప్రకారం, ఫోర్డ్ ఎగుమతి ఇంకా దేశీయ మార్కెట్ల కోసం ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయడానికి దాని రెండు తయారీ సౌకర్యాలలో ఒకదాన్ని ఉపయోగిస్తుందని కూడా కంపెనీ గతంలో తెలిపింది. అయితే, ఇప్పుడు భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని ప్రారంభించడం లేదని కూడా ఫోర్డ్ కంపెనీ ప్రకటించింది.



ఇక ఫోర్డ్ ఇండియా అధిరాకిరిక ప్రకటన ప్రకారం, 'జాగ్రత్తగా సమీక్షించిన తర్వాత, మేము ఏ భారతీయ ప్లాంట్ నుండి కూడా ఎగుమతి చేయడానికి ఈవీ తయారీని కొనసాగించకూడదని నిర్ణయించుకున్నాము. ఉత్పత్తి అనుబంధిత ప్రోత్సాహకాల క్రింద మా ప్రతిపాదనను భారత ప్రభుత్వం ఆమోదించినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. ఇందుకు ప్రభుత్వానికి మా కృతజ్ఞతలు' అని పేర్కొనబడి ఉంది.ఇక గతంలో ఫోర్డ్ ఇండియా పేర్కొన్న సమాచారం ప్రకారం,ఇండియాలో గడచిన 10 ఏళ్ల కాలంలో ఈ అమెరికన్ కంపెనీ సుమారు 2 బిలియన్ డాలర్ల వరకు నష్టపోయినట్లు కంపెనీ తెలిపింది. ఈ పరిస్థితుల్లో తాము వ్యాపారాన్ని కొనసాగించలేమని అందుకే ఇక ఈ కఠిన నిర్ణయం తీసుకోక తప్పడం లేదని ఫోర్డ్ కంపెనీ పేర్కొంది. గత సంవత్సరం సెప్టెంబర్‌ నుంచి భారతదేశంలోని రెండు ప్లాంట్లలో ఫోర్డ్ తమ వాహనాల ప్రొడక్షన్ ని నిలిపివేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారతదేశం నుండి ఎగుమతి చేయబడే ఇంజన్ల ఉత్పత్తిని కూడా ఫోర్డ్ కంపెనీ నిలిపివేయబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: