పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షాహిన్ అఫ్రిది సాధించిన రికార్డ్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం అయింది. ఇంగ్లాండ్ కౌంటీలో హాంప్ షైర్ తరుపున ఆడిన ఈ యువ బౌలర్ వరుసగా నాలుగు వికెట్లు తీసాడు.  జాన్ సింప్సన్, స్టీవెన్ ఫిన్, తిలాన్ వలల్లవిత మరియు టిమ్ ముర్తాగ్ లను వరుస బంతుల్లో బౌల్డ్ చేసాడు. అఫ్రిది 19 పరుగుల ఇచ్చి 6 వికెట్లు తీసుకున్నాడు.

హాంప్‌ షైర్ అత్యుత్తమ టి 20 బౌలింగ్ గణాంకాలు ఇవే అని జట్టు అధికారిక ప్రకటన చేసింది. వారి కౌంటీ చరిత్రలో ఇది రెండో హ్యాట్రిక్. టీ 20 లో నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన ఆరవ ఆటగాడుగా అతను రికార్డ్ సృష్టించాడు. ఇక ఇదిలా ఉంటే ఆరు వికెట్లు తీసి ఆరు వికెట్లు బౌల్డ్ చేసిన తొలి బౌలర్ కూడా అతనే కావడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: