ఋతుపవనాల ప్రభావంతో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. వర్షాల దెబ్బకు హైదరాబాద్ వాసుల గుండెల్లో మళ్ళీ రైళ్ళు పరిగెడుతున్నాయి. తెలంగాణా వ్యాప్తంగా గత వారం రోజుల నుంచి విస్తారంగా వర్షాలు పడటమే కాకుండా కొన్ని లోతట్టు ప్రాంతాలు చిన్న చిన్న వరదలతో ఇబ్బందులు పడుతున్నాయి. హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు అయింది.

ఉప్పల్ లో అత్యధికంగా 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. హయత్ నగర్ లో 19.2 సెంటీమీటర్లు..  సరూర్ నగర్ లో 17.2 సెం. మీ వర్షపాతం నమోదు అయిందని అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ మంత్రి కేటీఆర్ సూచనలు చేస్తూ అధికారులను అలెర్ట్ చేసారు. ఎల్బీనగర్, ఉప్పల్ నియోజకవర్గాల్లో ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యల్లో జిహెచ్ఎంసి డిజాస్టర్ బృందాలు పాల్గొన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: