మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ఇద్ద‌రూ క‌లిసి న‌టిస్తున్న చిత్రం ఆచార్య‌. ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ఈ సినిమాను తెర‌కు ఎక్కిస్తున్నారు.  నిరంజ‌న్‌రెడ్డి  నిర్మిస్తున్న ఈ చిత్రానికి కొణిదెల ప్రొడ‌క్ష‌న్ స‌మ‌ర్పిస్తుంది. ప్ర‌స్తుతం నిర్మాణాంత‌రం ప‌నుల్లో ఈ సినిమా ఉన్న‌ది. వ‌చ్చే సంవ‌త్స‌రం  ఫిబ్ర‌వ‌రి 04న చిత్ర యూనిట్ ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానుంది. ఈ త‌రుణంలోనే ప్ర‌చార ప‌ర్వాన్ని వేగ‌వంతం చేస్తూ ఉన్నారు.

ఇందులో భాగంగానే దీపావ‌ళి కానుక‌గా రెండో గీతాన్ని విడుద‌ల చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్‌, పూజాహేగ్దేల మ‌ధ్య నీలాంబ‌రి గీతాన్ని న‌వంబ‌ర్ 05 ఉద‌యం 11.07 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించింది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రెండో పాట ప్రోమో విడుద‌లైంది. నీలాంబ‌రి అని సాగే ఈపాట‌లో రామ్‌చ‌ర‌ణ్ త‌న ఢ్యాన్స్‌తో ఆకట్టుకున్నాడు. పూజా లుక్స్ చాలా క్యూట్‌గా క‌నిపించాయి. ఈ చిత్రంలో చ‌ర‌ణ్ సిద్ధ అనే న‌క్సైలైట్‌గా.. ఆయ‌న ప్రేయ‌సి నీలాంబ‌రిగా పూజా క‌నిపించ‌నుంది. ధ‌ర్మ‌స్థ‌లి కేంద్రంగా ఓ కామ్రెడ్ చేసిన పోరాటం నేప‌థ్యంలో సాగే క‌థ ఈ చిత్రం.


మరింత సమాచారం తెలుసుకోండి: