బంగారం అక్ర‌మ ర‌వాణాకు చెక్ పెట్టేందుకు క‌స్ట‌మ్స్ అధికారులు ఎన్నోక‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటూ ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ ప‌లువురు ప‌లు మార్గాల‌లో బంగారాన్ని ఇత‌ర దేశాల నుంచి భార‌త్ కు అక్ర‌మంగా త‌రలిస్తూ.. ప‌ట్టుబడుతూ ఉన్నారు. తాజాగా శంషాబాద్ విమానాశ్ర‌యంలో అక్ర‌మంగా పెద్ద మొత్తంలో త‌ర‌లిస్తున్న బంగారాన్ని క‌స్ట‌మ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

2.7 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నాం అని.. దీని విలువ 1.36 కోట్లు ఉంటుంద‌ని  అధికారులు తెలిపారు. దుబాయ్ నుంచి వ‌చ్చిన ప్ర‌యాణికున్ని నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకుంటున్న‌ట్టు తెలిపారు. దుబాయ్ నుంచి హైద‌రాబాద్ కు వ‌చ్చిన న‌వాజ్ పాషా అనే వ్య‌క్తి క్యాప్సూల్స్‌, చైన్లు, పేస్ట్ రూపంలో హాండ్ బ్యాగ్ లో గోల్డ్ స్మ‌గ్లింగ్ చేస్తున్న‌ట్టు అధికారులు గుర్తించారు. అనుమానం వ‌చ్చి త‌నిఖీలు చేయ‌గా.. బంగారం బ‌య‌ట‌ప‌డిన‌ట్టు పేర్కొన్నారు. దీని విలువ 1.36 కోట్ల రూపాయ‌లుంటుంద‌ని.. నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న‌ట్టు క‌స్ట‌మ్స్ అధికారులు వెల్ల‌డించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: