హోలి అంటేనే రంగుల పండుగ.. ఈ పండగ చిన్నా పెద్దా అంతా తేడా లేకుండా సంబరంగా జరుపుకుంటారు. అలాంటి హోలీకి ఏకంగా నాలుగు రోజులు సెలవులు వచ్చేశాయి.. అలాగని ఊరికే సంబరపడిపోకండి.. ఈ అవకాశం ఎంపీలకు మాత్రమే సుమా.. అవును.. హోలీ కోసం ఈనెల 17, 18 తేదీల్లో రాజ్యసభ జరగదని.. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు ప్రకటించారు. ఈ రెండు రోజులను అధికారిక సెలవులుగా ఆయన ప్రకటించారు.

మరి రెండు రోజులు సెలవులు అయినా.. నాలుగు రోజులు అంటారేంటి అనుకుంటున్నారా.. అవును.. ఈనెల 19, 20 వీకెండ్ కదా.. ఆ రోజుల్లో పార్లమెంట్ ఎలాగూ ఉండదు కదా. అందువల్ల ఎంపీలకు ఈనెల 17 నుంచి 20 వరకూ నాలుగు రోజులు సెలవులే అన్నమాట. మళ్లీ వారు పార్లమెంట్‌కు రావాల్సింది 21 వ తేదీ మాత్రమే. అందుకే ఎంపీలకు ఈ హోలికి నాలుగు రోజులు సెలవులు వచ్చినట్టయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: