కొత్త జిల్లాల విషయంలో సీఎం జగన్ ఓ నిబంధనను పక్కన పెట్టారు. మొదట్లో ఒక నియోజక వర్గం మొత్తం ఒకే జిల్లాలో వచ్చేలా కొత్త జిల్లాలు రూపొందించారు. కానీ ప్రజల నుంచి కొన్ని చోట్ల వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి కొన్ని చోట్ల ఈ నిబంధనను పక్కకు పెట్టినట్టు తెలుస్తోంది.

ఆ మార్పులు ఏంటంటే.. కాకినాడ జిల్లాలోకి పెదపూడి మండలాన్ని మార్చారు. రాజమండ్రిలోకి  గోకవరం మండలాన్ని మార్చారు. చిత్తూరు జిల్లాలో నగరి, నిండ్ర, విజయపురం మండలాలు చేర్చారు. చిత్తూరు రెవెన్యూ డివిజన్‌లోకి పాకాల మండలాన్ని చేర్చారు. నెల్లూరు జిల్లాలోకి రాపూరు, సైదాపురం, కలువాయి మండలాలు కలిపారు. అనంతపురం జిల్లాలోకి రాప్తాడు, ఆత్మకూరు మండలాలు చేర్చారు. శ్రీసత్యసాయి జిల్లాలోకి చెన్నేకొత్తపల్లి, రామగిరి, కనగానపల్లి చేర్చారు. నంద్యాల జిల్లాలో కలిసిన పాణ్యం, గడివేముల మండలాలు వచ్చాయి. కడప రెవెన్యూ డివిజన్‌లోకి సిద్దవటం, ఒంటిమిట్ట మండలాలు  చేర్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: