ఏపీలో ప్రజల నుంచి పన్నులు ఆదాయం జాతీయ సగటు కంటే ఎక్కువ రాబడుతున్నారట. అంతే కాదు..  ఎక్కడయినా పన్ను రాకుండా పోతుందేమో చూసి కఠినంగా ఉండండి అని ఆదేశాలు కూడా ఇస్తున్నారట. అంటే ఈ పాలకులకు ప్రజలకు కావల్సిన వసతులు, అభివృద్ధి మీద కంటే పన్నులు వసూలు మీదే శ్రద్ధ ఎక్కువగా ఉందంట. వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే మూడేళ్ళల్లో రాష్ట్ర ఆదాయాలు, అప్పులు, పెట్టుబడి వ్యయాలపై శ్వేత పత్రం విడుదల చేయాలట.


అంతే కాదు.. బడ్జెట్ అంచనాల ప్రకారం ఆర్థిక సంవత్సరం మొత్తంలో చేయాల్సిన అప్పు మొదటి అయిదు నెలల్లోనే జగన్ చేసేశారట. వైసీపీ ప్రభుత్వానికి అప్పులు చేయడంలో కూడా ఒక విధానంగానీ, బడ్జెట్ అంచనాలు పట్టించుకోవడంగానీ లేదట. ప్రభుత్వ సొంత ఆదాయ మార్గాలు పెంచుకోకుండా అప్పుల మీద బండి లాగించాలని చూస్తోందట. పొరుగు రాష్ట్రాల్లో సొంత ఆదాయ మార్గాలు పెంచుకొంటుంటే ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం కనీస అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం లేదట. ఇవన్నీ విపక్షాల విమర్శలు.. మరి వాస్తవం ఏంటో జనమే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

AP