దళిత అభ్యున్నతికి కృషి చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‍ రెడ్డికి దక్కిందని వైసీపీ మంత్రులు అంటున్నారు. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటించే నాయకుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అంటున్నారు. రాబోయే తరాల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని దేశంలో ఎక్కడా లేని విధంగా అధికారంలోకి వచ్చిన మూడు సంవత్సరాల్లో 98 శాతం హామీలు అమలు చేశారన్నారు.

దళిత అభ్యున్నతికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ కు అందరూ అండగా నిలవాలన్నారు. రాష్ట్రంలో దళితులకు సముచిత స్థానం కల్పిస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అని మరో మంత్రి  నాగార్జున అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ అవినీతి లేకుండా డి.బి.టి ద్వారా దళితులకు 55 వేల కోట్లు అందించామన్నారు. తిరుపతి ఎస్వీయూలో నిర్వహించిన దళితుల ఆత్మీయ సదస్సులో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామితో పాటు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, మేరుగ నాగార్జున, రోజా పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: