గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో రహదారి విస్తరణ కోసం ఇళ్లు కూల్చడం వివాదాస్పదం అయ్యింది. ఈ అంశంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఇప్పటంలో రోడ్దు విస్తరణ  చేయమని ఎవరడిగారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ధ్వజమెత్తారు.  జనసేన సభకు భూములిచ్చారన్న కక్ష్యతోనే ఒక సామాజిక వర్గం వారి ఇళ్లు కూల్చారని మండిపడ్డారు.  రాష్ట్రంలో రోడ్ల దుస్తితి ముఖ్యమంత్రికి తెలీదా..?

గుంతల్లో పడి వైకాపా కార్పోరేటర్ చనిపోయిందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్  ఆగ్రహం వ్యక్తంచేశారు.  ప్రభుత్వంకు చేతనైనే రోడ్లపై గుంతలు పూడ్చలని, కూల్చడం వైసీపీ  ప్రభుత్వ పేటెంట్ హక్కులా భావిస్తున్నారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్  విమర్శించారు.  అక్రమ కట్టడం అని ప్రజావేదిక కూల్చిన సీఎం, మూడున్నరేళ్లలో  ఎన్ని అక్రమ కట్టడాలు కూల్చారని శ్రావణ్ నిలదీశారు. దాడులు చేయటం, రాళ్లు వేయించటం రాజశేఖర్ రెడ్డి కుటుంబ పేటెంట్ హక్కని దుయ్యబట్టారు.  నంద్యాల సభలో ప్రధాని పీవీ నరసింహరావుపై రాజశేఖర్ రెడ్డి రాళ్లు వేయించారని తెనాలి శ్రావణ్ ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: