ప్రధాని మోదీ.. ఈనెల 11,12 తేదీల్లో విశాఖపట్నం రానున్నారు. నగరంలో అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అయితే.. ఈ టూర్‌లో మోదీకి షాక్ ఇవ్వాలని జగన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. విశాఖపట్నం రానున్న ప్రధానమంత్రిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున,రాష్ట్ర ప్రజానీకం తరఫున ఘన స్వాగతం పలికాలని నిర్ణయించారని తెలుస్తోంది.


ప్రధానిని గౌరవించుకునేలా విశాఖలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. లక్షలాది మంది కార్యకర్తలు తరలి వచ్చి కార్యక్రమం విజయవంతం చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఆంధ్ర విశ్వ విద్యాలయంలో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు  సాగుతున్నాయి. నియోజకవర్గంలో పాటు శ్రీకాకుళం జిల్లా ప్రజానీకం కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా కృషి చేస్తున్నారు.  రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధానమంత్రి కి వివరించేందుకు చక్కని వేదికగా కార్యక్రమం ఉపయోగ పడనుంది. రాష్ట్ర ప్రభుత్వం నిజాయితీ, పారదర్శక  పాలనను ప్రధాని ఎప్పుడో గుర్తించారని వైసీపీ భావిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: