ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మరో కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారు. విశాఖపట్నాన్ని రాజధానిగా చేయాల్సిందేనంటున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు.. అలా చేయలేని పక్షంలో విశాఖను కొత్త రాష్ట్రంగానైనా ప్రకటించాలని డిమాండు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆదాయం మొత్తం ఖర్చుపెట్టి హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామని.. కానీ.. విభజనతో విడిచిపెట్టి వచ్చామని మంత్రి ధర్మాన ప్రసాదరావు గుర్తు చేశారు. అలాంటి పొరపాటు పునరావృతమైతే మరో 70 ఏళ్లు ఈ విశాఖ ప్రాంతం వెనుకబాటుతోనే ఉండాల్సి వస్తుందని మంత్రి ధర్మాన ప్రసాదరావు అంటున్నారు.


టీడీపీ అధినేత చంద్రబాబు మతిభ్రమించి ‘బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ అంటూ తిరుగుతున్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. అమరావతి కేవలం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల నగరమని మంత్రి ధర్మాన ప్రసాదరావు కామెంట్ చేశారు. ఇప్పటి వరకూ తెలుగు ప్రాంతంలో ప్రత్యేక తెలంగాణ, ప్రత్యేక ఆంధ్ర, ప్రత్యేక సీమ రాష్ట్రాల డిమాండ్లు వచ్చాయి. ఇక ఇప్పుడు మంత్రి ధర్మాన ప్రత్యేక విశాఖ రాష్ట్రం డిమాండ్‌ను తెర పైకి తెచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: