కరోనా కారణంగా చైనాలో పరిస్థితులు దిగజారుతున్నప్పటికీ.. అక్కడి ప్రభుత్వం కేసులు, మరణాలను దాచిపెడుతోంది. నిత్యం వేలాది మంది చనిపోతున్నట్లు తెలుస్తున్నా ఐదారుగురు మాత్రమే మృతి చెందుతున్నారని లెక్కలు చెబుతోంది. అక్కడి ప్రజలు మాత్రం.. చైనా సర్కారు తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంక్షలు ఎత్తి వేసిన తర్వాత తన కుటుంబంలోనే నలుగురు ప్రాణాలు కోల్పోయారని...ఒక బీజింగ్‌ వాసి తెలిపారు.


ఇక చైనాలో కేసుల ఉద్ధృతిని దృష్టిలో పెట్టుకొని అనేక దేశాలు అక్కడి నుంచి వచ్చే ప్రజలపై ఆంక్షలు విధించాయి. చైనా నుంచి తమ దేశానికి వచ్చేవారు.. ముందు పరీక్షలు చేయించుకొని నెగెటివ్‌ రిపోర్టు తీసుకొని రావాలని అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌, ఐరోపా దేశాలు చెబుతున్నాయి. అయితే.. ఈ ఆదేశాలపై చైనా మండిపడుతోంది. ఆయా దేశాల నిబంధనలు ఏమాత్రం సైద్ధాంతికంగా లేవని విమర్శిస్తోంది.  అంతే కాదు.. చైనాలో కేసుల ఉద్ధృతి విషయంలో వస్తున్న ఆరోపణలపై ఆ దేశం ఎదురు దాడి చేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: