రోజంతా తాజాగా వుండాలంటే,కీరదోస ఒకటి, ఎప్సం సాల్ట్ రెండు కప్పులు, పెప్పర్మెంట్ టీ బ్యాగ్స్ 5. ముందుగా కీరదోస తొక్క తీసి, ముక్కలుగా కోసుకోవాలి. ఇక ఈ ముక్కలను మిక్సీలో వేసి మెత్తటి పేస్టులా తయారు చేసుకోవాలి. దీనిని ఒక పలుచటి వస్త్రంలో వేసి, దాని నుంచి వచ్చే రసాన్ని స్నానానికి సిద్ధం చేసుకున్న బకెట్ నీళ్ళలో వేసి కలపాలి. తర్వాత ఒక మగ్గు నీళ్ళు తీసుకొని, అందులో రెండు కప్పుల ఎప్సం సాల్ట్, అలాగే పెప్పర్మెంట్ టీ బ్యాగ్స్ వేసి బాగా మరిగించాలి. ఇక మరిగేటప్పుడు ఆ నీటి స్థాయి సగం అయ్యేవరకు మరిగించి, ఆ నీటిని కూడా బకెట్లో కలిపేయాలి. ఇక వీటన్నింటినీ బాగా కలిపి, ఆ నీటితో స్నానం చేస్తే చర్మం తిరిగి తాజాగా మారడమే కాకుండా మనలో కొత్త ఉత్సాహం పుట్టుకొస్తుంది..