
టమాటోస్ ను స్లైసెస్ గా చేసుకొని వాటిని ఐ లిడ్స్ మీద పెట్టాలి. లేదంటే, టమాటో జ్యూస్ ను తీసుకుని అందులో అలోవెరా జెల్ ను ఈక్వల్ ప్రొపోర్షన్ లో యాడ్ చేసి ఈ మిక్స్చర్ని కంటి కింద అప్లై చేయాలి. ఈ మిక్స్చర్ అండర్ ఐ స్కిన్ ని కాంతివంతం చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే, తగినంత హైడ్రేషన్ ను కూడా అందిస్తుంది.రోజ్ వాటర్ అద్భుతమైన పరిమళాలను వెదచల్లడంతో పాటు స్కిన్ ను సూత్ చేసి కాంతివంతంగా తయారుచేసేందుకు హెల్ప్ చేస్తుంది. అలసిన చర్మానికి లైఫ్ ను అందిస్తుంది. కాబట్టి, ఇది స్కిన్ టోనర్ గా పనిచేస్తుంది. కుకుంబర్ లాగానే ఇది మైల్డ్ అస్ట్రింజెంట్ కూడా. కాటన్ బాల్ ను రోజ్ వాటర్ లో ఒక నిమిషం పాటు ఉంచి ఆ నానిన కాటన్ బాల్ ను మూసిన ఐ లిడ్స్ పై పదినిమిషాల పాటు ఉంచాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేయాలి.
కంటి కింద పఫీనెస్‌కి పొటాటో గ్రేట్ రెమెడీ అని చెప్పుకోవచ్చు. ఇందులో అస్ట్రింజెంట్ ప్రాపర్టీస్ కలిగిన ఎంజైమ్స్ ఉన్నట్టు ప్రూవ్ అయింది. ఇది ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. స్కిన్‌ని టైట్ చేస్తుంది. పొటాటోను స్లైసెస్ గా కట్ చేసుకుని దానికి కొన్ని హొల్స్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టండి.దోసకాయలో కూడా స్కిన్ కు కాంతిని అందించి బూస్ట్ చేసే ప్రాపర్టీస్ ఎన్నో ఉన్నాయి. ఇందులో మైల్డ్ అస్ట్రింజెంట్ ప్రాపర్టీస్ కలవు. తాజా దోసకాయను ఫ్రిడ్జ్ లో ఉంచాలి. దాన్ని రెమెడీగా వాడే ముందు బయటకు తీసి థిక్ స్లైసెస్ గా కట్ చేయాలి. ఈ స్లైసెస్ ను కంటిపై పదినిమిషాలపాటు ఉంచాలి. ఐ లిడ్స్ పై ఉన్న దోసకాయ రసాన్ని సున్నితంగా ఫింగర్ టిప్స్ తో మసాజ్ చేయాలి.చమోమైల్ టీలో నేచురల్ యాంటీ ఆక్సిడెంట్ అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇవి కంటి కింద స్కిన్ ను సూత్ చేసేందుకు హెల్ప్ చేస్తాయి.
కోల్డ్ టీ బ్యాగ్స్ ను కంప్రెస్ గా వాడేటప్పుడు టీ బ్యాగ్ ను శుభ్రమైన నీటిలో నానబెట్టి ఆ తరువాత ఆ టీ బ్యాగ్ ను ఫ్రిడ్జ్ లో ముప్పై నిముషాలు ఉంచాలి. ఈ టీ బ్యాగ్ ను కంటిపై ఉంచాలి. ఇది కళ్ళను అలాగే మనసును రిలాక్స్ చేసేందుకు హెల్ప్ చేస్తుంది.కంటి కింద బ్లడ్ అక్యుములేట్ అవకుండా ఉండేందుకు మీ మునివేళ్లతో కంటి కింద స్కిన్ ను సున్నితంగా మసాజ్ చేయండి. అతిగా రబ్ చేయకండి.ఇక ఇలాంటి మరెన్నో సౌందర్య చిట్కాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి... ఇంకా మరెన్నో సౌందర్య చిట్కాలు గురించి తెలుసుకోండి...