కొబ్బరినూనె ఒక జిగట ద్రవపదార్థం ఇది మన శరీరంలో సహజంగా ప్రవహించే సెబమ్ ను పోలి ఉంటుంది. ఈ కొబ్బరి నూనె మన చర్మం ఎండిపోకుండా కాపాడుతుంది. అదే విధంగా జుట్టు కుదుళ్లు దెబ్బతినకుండా కాపాడటమే వల్ల జుట్టు ఎంతో దృఢంగా ఉంటుంది. కొబ్బరి నూనెలో ఉన్నటువంటి లారిక్ ఆమ్లం జుట్టులోని ప్రొటీన్లను బంధించడానికి సహాయపడుతుంది. కొబ్బరి నూనెలో ఉన్నటువంటి యాంటీఆక్సిడెంట్లు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.
సాధారణంగా మన జుట్టు రాలిపోవడానికి లేదా పెరుగుదలను నియంత్రించడంలో బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్ కారణమవుతుంది.కొబ్బరి నూనెలో ఉన్నటువంటి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు వీటితో పోరాడి జుట్టు పెరుగుదలకు సహకరిస్తాయి. సాధారణంగా కొబ్బరి నూనె కూడా జుట్టుకు మంచి కండిషనర్ లాగా ఉపయోగపడి జుట్టు మృదువుగా ఉండటానికి సహకరిస్తుంది. కొబ్బరి నూనెతో తలకు బాగా మసాజ్ చేయడం ద్వారా రక్త ప్రసరణ వ్యవస్థ జరగడమే కాకుండా, తలనొప్పి, తలభారం వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి