మీ పెదాలని పింక్ గా మార్చే సహజ చిట్కాలు ?

మీ పెదాలు న్యాచురల్ గా పింక్ కలర్‌లో ఉండాలంటే బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగాల్సిన పని లేదు. పెదాలకు చీప్ లిప్ బామ్ ని వాడకపోవడమే మంచిది. పెర్ఫ్యూమ్ లిప్ బామ్‌లను కూడా వాడటం ఖచ్చితంగా మానుకోవాలి.అందులో SPF ఉందో లేదో కూడా ఖచ్చితంగా చెక్ చేయాలి. కనీసం 30 SPF ఉన్న లిప్ బామ్‌ను మాత్రమే కొనుగోలు చేసుకోని వాడితే పెదాలకు మంచిది.రాత్రిపూట పెదవులపై నిమ్మకాయ, బంగాళాదుంప, బీట్‌రూట్ రసాన్ని అప్లై చేసుకోవాలి. ఉదయం నిద్రలేవగానే కడగాలి. ఈ స్క్రబ్ పెదవులపై ఉన్న నల్లటి మచ్చలను తొలగించి గులాబీ రంగులో మెరిసేలా చేస్తుంది.వారానికి ఒకసారి ఈ హోం రెమెడీని ఉపయోగిస్తే, కొద్ది రోజుల్లోనే మార్పును గమనించవచ్చు. అలాగే పెదవులపై రెగ్యులర్ లిప్ బామ్ అప్లై చేసుకోవాలి. ఫలితంగా పెదవులు పొడిబారవు. 


రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనెను పెదవులపై అప్లై చేసుకోవాలి. ఇలా రెగ్యులర్‌గా చేయడం వల్ల పెదాలు మృదువుగా మారుతాయి.చక్కెర, తేనె ప్యాక్ పెదవులపై మృత చర్మాన్ని తొలగించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. బాదం నూనెను అప్లై చేయడం ద్వారా పెదాల తేమను కోల్పోకుండా ఉంటాయి. లేదంటే అలోవెరా జెల్, పంచదార మిక్స్ చేసి స్క్రబ్‌లా ఉపయోగించుకోవచ్చు.పింక్ పెదాల కోసం మీరు ఖరీదైన ఉత్పత్తులను ఉపయోగించాల్సిన పని లేదు. మృదువైన గులాబీ రంగు పెదాలను పొందడానికి ఇంట్లోనే పైన చెప్పిన ఆ సులభమైన చిట్కాలు ట్రై చేస్తే సరిపోతుంది. అయితే మీరు ఈ టిప్స్ పాటించే ముందుగా పెదవులు ఎందుకు నల్లగా మారుతాయో తెలుసుకోవాలి? శరీరంలో తగినంత తేమ లేకపోతే దాని ప్రభావం ఖచ్చితంగా పెదవులపై  పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా రోజుకు కనీసం 7 నుంచి 8 గ్లాసుల నీళ్లు త్రాగాలి. లేదంటే మీ పెదవులు గరుకుగా మారుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: