వెర్సటైల్ యాక్టర్ ఆది సాయి కుమార్ నటిస్తున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘శంబాల : ఎ మిస్టికల్ వరల్డ్’. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి యగంధర్ ముని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అర్చన అయ్యర్, స్వసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ తదితరులు కీలక పాత్రల్ని పోషించారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన బిజినెస్ పూర్తయిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంపై ఉన్న క్రేజ్, బజ్, డిమాండ్ మేరకు ఫ్యాన్సీ రేటుకే మేకర్స్ అమ్మేశారు.

‘శంబాల’ నుంచి ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ప్రతీ కంటెంట్ ఆడియెన్స్‌లో అంచనాల్ని పెంచేసింది. ఇక సోషల్ మీడియాలో అయితే శంబాల మేకింగ్ వీడియో, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా ట్రెండ్ అయ్యాయి. ఇక డిసెంబర్ 25 రాబోతోన్న ‘శంబాల’ బ్లాక్ బస్టర్ అని ట్రేడ్ సర్కిళ్లలో బలంగా వినిపిస్తోంది. దీనికి తగ్గట్టుగా భారీ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ‘శంబాల’ని అన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి.

నైజాం ఏరియాలో మైత్రి, ఏపీ, సీడెడ్ ఏరియాలో ఉషా పిక్చర్స్ ‘శంబాల’ మూవీని భారీ ఎత్తున డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఇక ఓవర్సీస్‌లో సైతం ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఓవర్సీస్ బాధ్యతల్ని మూన్ షైన్ సినిమాస్ తీసుకుంది. ఇక కర్ణాటకలో ఈ సినిమాను కుమార్ బెంగళూర్ ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఇప్పటికే ‘శంబాల’ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు ఓటీటీ సంస్థలో ఆహా పోటీ పడి గెలిచింది. ఇక శాటిలైట్ విషయంలో జీ నెట్‌వర్క్ ముందుండి హక్కులను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. సినిమా విడుదలకు ముందే నిర్మాతలు టేబుల్ ప్రాఫిట్స్‌లో ఉండటం విశేషం.

నిర్మాతలు రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డిసినిమా నిర్మాణంలో ఎక్కడా వెనుకాడకుండా భారీ బడ్జెట్‌తో రాజీపడని నాణ్యతతో రూపొందించారు. ఈ మూవీని విజువల్ వండర్‌‌గా, సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా అద్భుతమైన దృశ్య కావ్యంగా తెరకెక్కించారు.

ప్రవీణ్ కె బంగారి అందించిన ఆకర్షణీయమైన విజువల్స్, శ్రీచరణ్ పాకాల స్వరపరిచిన అద్భుతమైన నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారనున్నాయి. పాన్ ఇండియన్ స్థాయిలో రాణించగల ఈ చిత్రాన్ని డిసెంబర్ 25న క్రిస్మస్‌ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు భారీ ఎత్తున తీసుకురానున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: