
మే 29వ తేదీన ఒకసారి చరిత్రలో కి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖులు జననాలు జరిగాయి. మరి ఒకసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి.
బి ఎస్ మాధవరావు జననం : కన్నడ దేశానికి వలస వెళ్లిన తెలుగు కుటుంబానికి చెందిన ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త బి ఎస్ మాధవరావు 1900 సంవత్సరంలో 29వ తేదీన బెంగళూర్లో జన్మించారు. ఈయన కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి 1938లో డీఎస్సీ డిగ్రీని పొందారు. స్టాఫ్ ఆర్నమెంట్ టెక్నాలజీ లో బాలిస్టిక్ ప్రొఫెసర్గా కూడా 1950 నుంచి 60 మధ్య కాలంలో పనిచేశారు.
కడుర్ వెంకటలక్ష్మమ్మ జననం : మైసూరు రాజ స్థానానికి చెందిన సుప్రసిద్ధ భరతనాట్య నర్తకి అయిన కరూర్ వెంకటలక్ష్మి 1906 మే 29వ తేదీన జన్మించారు. మైసూరు శైలి కి చెందిన భరతనాట్యంలో ఈమె ఆరితేరిన కళాకారిణి. ఇక నాట్యం లో కల్లూరి వెంకట లక్ష్మమ్మ చేసిన సేవలకుగానూ 1992 సంవత్సరంలో భారత ప్రభుత్వం పద్మభూషణ్ తో సత్కరించింది. అంతే కాకుండా ఎన్నో పురస్కారాలు కూడా అందుకున్నారు కడుర్ వెంకట లక్ష్మమ్మ.
బండారు సదాశివరావు జననం : రచయిత సంపాదకుడు ఆర్ఎస్ఎస్ ప్రచారకుడు అయినా బండారు సదాశివరావు 1925 మే 29వ తేదీన జన్మించారు. 1942లో కాశీకి వెళ్ళిన సదాశివరావు కు ఓరుగంటి సుబ్రహ్మణ్యం తో పరిచయమైంది. ఆ తరువాత సదాశివరావు ఆర్ఎస్ఎస్ లో చేరారు. ఇక జాగృతి పత్రికకు సంపాదకునిగా కూడా పనిచేశారు సదాశివరావు . అనేక కథలను ఈయన ప్రచురించేవారు. కలం పేరుతో ఈయన చేసిన రచనలు వ్యగ్యం తో విమర్శలు ఎక్కువగా ఉండేది.
ఇంద్రగంటి శ్రీకాంత శర్మ జననం : ఎంతో ప్రఖ్యాతి చెందిన తెలుగు కవి అయిన ఇంద్రగంటి శ్రీకాంత శర్మ 1944 మే 29వ తేదీన జన్మించారు. ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి ఇతని తండ్రి కావడంతో చిన్నప్పటినుంచి సాహిత్య వాతావరణంలో పెరిగి విద్యార్థిదశలోనే రచనావ్యాసంగం చేపట్టాడు శ్రీకాంత శర్మ. ఆంధ్రజ్యోతి వార పత్రికలో సబ్ ఎడిటర్ గా కూడా పనిచేశారు. ఇక ఈయన రచించిన రచనలు ఎంతగానో ప్రేక్షకాదరణ పొందాయి. వివిధ కోణాలలో ఉండే ఇంద్రకంటి శ్రీకాంత శర్మ రచనలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునేది.
ఉషా జనం : తెలుగు నేపథ్య గాయని అయిన ఉష 1980 మే 29వ తేదీన జన్మించారు. సుమారు పది సంవత్సరాలుగా తెలుగు సినిమాలలో మధురమైన గానం అందించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. పాడుతా తీయగా అనే తెలుగు టీవీ ప్రోగ్రాం ద్వారా తన కెరీర్ను ప్రారంభించిన ఉష... ఈ కార్యక్రమంలో మొదటి స్థానంలో నిలిచింది. దీంతో ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో పలు సినిమాల్లో పాడేందుకు అవకాశాలు దక్కించుకుంది ఉష. వందేమాతరం శ్రీనివాస్ వద్ద తొలి అవకాశాన్ని దక్కించుకుంది. ఇల్లాలు చిత్రంతో మొదటి పాట పాడి సినిమా రంగంలో తన ప్రస్థానం మొదలు పెట్టింది ఉష.