ఆ మద్య సూర్య, మోహన్ లాల్ మూవీ ‘బందోబస్త్’ లో శత్రు దేశాలను దెబ్బ కొట్టాలంటే.. మిడతలను పంట పొలాల్లోకి వదిలితే.. అందులోనూ కేవలం మగ మిడతలను సెలెక్ట్ చేసి.. దాడి చేయిస్తే పంటలను పూర్తిగా నాశనం చేస్తాయి. దాంతో కరువు వాటిల్లి దేశం ఆర్థిక సంక్షోభం ఏర్పడటం.. ఆహార పదార్థాలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే దుస్థితి ఏర్పడటం జరుగుతుంది.  ఇలాటి కన్నింగ్ ప్లాన్ చేసి మిడతలను సృష్టిస్తారు.. ఇదో రకం యుద్దం అనే చెప్పొచ్చు.  తాజాగా పాకిస్థాన్ నుంచి వచ్చి పడుతున్న మిడతల దండు వల్ల భారత సరిహద్దులోని పంటలకు ప్రమాదం పొంచి వుందన్న ఐక్యరాజ్యసమితి హెచ్చరికలతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది.  పాక్ నుంచి వస్తున్న ఈ మిడతలు చాలా ప్రమాదకరమైనవి. రోజుకు 150 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయి.

 

అంతేకాదు, ఒక చదరపు మీటరు సమూహంలో ఉన్న మిడతలు 35 వేల మందికి సరిపడా ఆహారాన్ని అమాంతం మింగేయగలవని  ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ తెలిపింది.  వీటిని ఎదుర్కొనేందుకు బ్రిటన్ నుంచి ప్రత్యేక డ్రోన్లు, ఫైర్ టెండర్లు, స్ప్రేయర్లను దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది భారత్.  ఈ మిడతల దాడుల వల్ల రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో 3 లక్షల హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లింది.  అయితే మిడతల అంతమొందించేందుకు దృష్టి సారించిన కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ వాటి నివారణకు నడుంబిగించింది. లాక్‌డౌన్ అమల్లో ఉన్నప్పటికీ మిడతల నియంత్రణ కార్యాలయాలతో కలిసి 50 స్ప్రేయింగ్ పరికరాలు, వాహనాలతో మిడతలను నివారించాలని ఆ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ నిర్ణయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: