ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎన్నికల ముందు ఇచ్చిన మరో హామీ అమలు దిశగా జగన్ చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో వైఎస్సార్ చేయూత పథకం ద్వారా 45 సంవత్సరాలు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు నాలుగేళ్లలో రూ.75 వేలు దశలవారీగా ఆయా కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వం ఉచితంగా ఇవ్వనుంది. 
 
ఈరోజు కేబినెట్ ఈ పథకానికి ఆమోదం తెలిపే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 24.19 లక్షల మంది మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ధి కలగనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వైఎస్సార్‌ చేయూత ద్వారా లబ్ధి పొందే మహిళలకు ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగేళ్ల పాటు ఆర్థిక సాయం అందజేస్తారు. రూ.4,535.70 కోట్లు ప్రభుత్వం ఈ పథకం అమలు కోసం ఖర్చు చేయనుందని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: