నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఒడిశా తీరంలో ఉపరితల ఆవర్తనం, దానికి అనుబంధంగా ఉపరితల ద్రోణి కొనసాగుతుండటంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం చెబుతోంది. మిగిలిన కోస్తా జిల్లాల్లో కూడా రేపటి నుంచి మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటన చేసింది. 
 
రాయలసీమ జిల్లాల్లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని సమాచారం. కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిమీ వేగంతో గాలులు వీస్తాయని ప్రకటన చేసింది. మత్స్యకారులెవ్వరూ వేటకు వెళ్లొద్దని సూచనలు చేసింది. గడచిన 24 గంటల్లో చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: