ఉదయం తలనొప్పికి ప్రధాన కారణాలు
నిద్రలేమి లేదా అతిగా నిద్రపోవడం: రాత్రిపూట సరైన నిద్ర లేకపోయినా లేదా అవసరానికి మించి ఎక్కువ సమయం పడుకున్నా ఉదయం తలనొప్పి వచ్చే అవకాశం ఉంది.
డీహైడ్రేషన్ (: రాత్రంతా శరీరం నీటిని తీసుకోదు. ఉదయాన్నే తగినంత నీరు తాగకపోతే మెదడులోని రక్తనాళాలు సంకోచించి నొప్పిని కలిగిస్తాయి.
ఒత్తిడి : రోజంతా ఉండే పనుల ఒత్తిడిని మనసులోకి తీసుకుని నిద్రపోవడం వల్ల ఉదయం తలనొప్పి వస్తుంది.
రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడం: రాత్రి భోజనానికి, ఉదయానికి మధ్య ఎక్కువ సమయం ఉండటం వల్ల షుగర్ లెవల్స్ తగ్గి తలనొప్పి రావచ్చు.
తలనొప్పిని తగ్గించే ఆహార పదార్థాలు
మందులు వాడకుండా సహజ సిద్ధంగా తలనొప్పిని తగ్గించుకోవడానికి ఈ క్రింది ఆహారాలు సహాయపడతాయి:
నీరు: ఉదయం నిద్రలేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగడం వల్ల శరీరంలోని విషతుల్యాలు బయటకు పోయి, రక్తప్రసరణ మెరుగుపడుతుంది.
అల్లం టీ: అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది తలనొప్పిని తగ్గించడంలో మ్యాజిక్ లా పనిచేస్తుంది. ఉదయం ఒక కప్పు అల్లం టీ తాగడం వల్ల ఉపశమనం లభిస్తుంది.
బాదం పప్పులు: బాదంలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తనాళాలను రిలాక్స్ చేసి తలనొప్పిని అరికడుతుంది.
అరటిపండు: ఇందులో ఉండే పొటాషియం మరియు మెగ్నీషియం ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడతాయి. ఇది డీహైడ్రేషన్ వల్ల వచ్చే తలనొప్పిని తగ్గిస్తుంది.
పుచ్చకాయ: ఇందులో నీటి శాతం ఎక్కువ. శరీరానికి తక్షణమే హైడ్రేషన్ అందించి నొప్పిని తగ్గిస్తుంది.
అతిగా కాఫీ/టీ తాగడం: ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఎక్కువ కెఫిన్ తీసుకుంటే అది గ్యాస్ట్రిక్ సమస్యలకు మరియు తలనొప్పికి దారి తీస్తుంది.
రాత్రిపూట మద్యం సేవించడం వల్ల 'హ్యాంగోవర్' హెడేక్ వచ్చే అవకాశం ఉంది.ప్రాసెస్ చేసిన ఆహారాలు: నిల్వ ఉంచిన పదార్థాలు, చిప్స్ వంటివి తలనొప్పిని ప్రేరేపిస్తాయి.
చిన్నపాటి అలవాట్లు మార్చుకోవడం ద్వారా మార్నింగ్ హెడేక్ సమస్యను దూరం చేసుకోవచ్చు. రాత్రిపూట సరైన సమయానికి నిద్రపోవడం, ఉదయాన్నే హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యం. ఒకవేళ తలనొప్పి ప్రతిరోజూ వస్తుంటే మాత్రం వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి