ఏపీ సిఎం వైఎస్
జగన్ మోహన్ రెడ్డి సొంత ఇలాకా
ఇడుపులపాయ లో రేపు ఎల్లుండు... రెండు రోజుల పాటు పర్యటించే అవకాశం ఉంది. 2 తేది తన
తండ్రి, దివంగత మాజీ సిఎం వైఎస్
రాజశేఖర్ రెడ్డి వర్దంతి వేడుకలకు హాజరు కానున్న సిఎం జగన్.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా హాజరయ్యే అవకాశం ఉంది.
ఇడుపులపాయ లో సిఎం
జగన్ పర్యటన కు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు... కరోనా టెస్ట్ లు కూడా నిర్వహిస్తున్నారు.
ప్రతీ ఒక్కరికి కరోనా టెస్ట్ లు నిర్వహించగా
వైసీపీ ఎంపీ వైఎస్
అవినాష్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా వచ్చింది అనే వార్తలు వస్తున్నాయి. దీనితో అధికారులు అప్రమత్తం అయ్యారు. అటు పోలీసు అధికారులలో కూడా కరోనా కేసులు పెరగడంతో వారికి కూడా కరోనా పరీక్షలను నిర్వహిస్తున్నారు.