ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా జమ్ముకశ్మీర్‌లోని ప్రధాన రాజకీయ పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. ఈ మేరకు గురువారం సమావేశాన్ని నిర్వహించాయి. రాష్ట్రం, ప్రత్యేక హోదా పునరుద్ధరణ కోసం కలిసి పని చేయాలని నిర్ణయించాయి. ఈ సమస్య గురించి సంబంధిత వర్గాలతో చర్చించాలని సమావేశంలో తేల్చాయి.ఈ భేటీ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు ఫారుక్ అబ్దుల్లా నివాసంలో జరిగింది.


ఇందులో పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, పీపుల్స్ కాన్ఫరెన్స్ ఛైర్మన్​ సాజద్ లోన్​, పీపుల్స్ మూమెంట్ నేత జావైద్ మీర్, సీపీఎం నేత మహ్మద్ యూసఫ్ తరిగామి పాల్గొన్నారు.కశ్మీర్ పీసీసీ చీఫ్ గులామ్ అహ్మద్ మీర్ ఆరోగ్య కారణాల రీత్యా ఈ భేటీకి హాజరుకాలేకపోయినట్లు కాంగ్రెస్ ప్రతినిధి తెలిపారు.ఆర్టికల్ 370 పునరుద్ధరణ జరిగే వరకు ఈ కూటమి కొనసాగుతుందని స్పష్టం చేశారు అబ్దుల్లా. ఈ సందర్భంగా 14 నెలల నిర్బంధం తర్వాత విడుదలైన ముప్తీకి అబ్దుల్లా శుభాకాంక్షలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: