జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీకి షాక్‌ తగిలింది. జాతీయ జెండానుద్దేశిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యల కారణంగా ఆ పార్టీకి చెందిన ముగ్గురు నేతలు సోమవారం పార్టీని వీడారు. ఆమె చేతల వల్ల పార్టీలో ఇమడలేకపోతున్నామని, ముఖ్యంగా దేశభక్తి విషయంలో మనోభావాలు దెబ్బతీసేలా ఆమె చేసిన వ్యాఖ్యల వల్ల తాము పార్టీకి రాజీనామా చేస్తున్నామని ప్రకటించారు. ఈ మేరకు ఆ పార్టీ నేతలు టీఎస్‌ బజ్వా, వేద్‌ మహాజన్‌, హుస్సేన్‌ ఏ వప్ఫా ఆమెకు రాజీనామా లేఖలు పంపారు.


ఆర్టికల్‌ 370 రద్దుతో ఉనికి కోల్పోయిన జమ్ముకశ్మీర్‌ ప్రత్యేక జెండాను ఐక్య పోరాటంతో తిరిగి సాధించుకుంటామని ముఫ్తీ ఇటీవల అన్నారు. ఈ క్రమంలో ప్రత్యేక జెండాను ఎగురవేసేందుకు అనుమతించినప్పుడే త్రివర్ణ పతాకాన్ని కూడా ఎగురవేస్తామని చెప్పారు. దీంతో ఆమె వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: