కరోనా మహమ్మారి దేశంలో మళ్ళీ పంజా విసురుతుంది. కరోనా సెకండ్ వేవ్ రూపంలో ఒక్క సరిగా కేసుల సంఖ్య దేశంలో విపరీతంగా పెరుగుతుంది. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా బీజేపీ మాజీ కేంద్ర మంత్రి దిలీప్ మన్సూఖ్ లాల్ గాంధీ కరోనా మారిన పడి మరణించడం అందరినీ షాక్ గురిచేసింది. డిల్లీ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్ను మూశాడు. మహారాష్ట్ర నియోజిక వర్గం నుండి దిలీప్ మూడు సార్లు లోక్ సభ ను ఎన్నికయ్యారు.

 2003 జనవరి 29 నుండి 2004 మార్చి 15 వరకు కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.దిలీప్ మన్సూఖ్ మృతికి పలువురు బీజేపీ నేతలు, ప్రముఖులు సంతాపం తెలిపారు. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.." మాజీ కేంద్ర మంత్రి, పార్టీ సీనియర్ నాయకుడు దిలీప్ గాంధీ మరణం గురించి విచారకరమైన వార్తలు వచ్చాయి. దిలీప్ జీ జీవితమంతా ప్రజా సేవ మరియు సంస్థ కోసం అంకితం చేయబడింది. భరించలేని ఈ బాధను భరించే శక్తిని దేవుడు తన కుటుంబానికి ఇస్తాడు. శాంతి శాంతి శాంతి " అంటూ ట్వీట్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: