దేశంలో కరోనా విజృంభణ ఏ స్థాయిలో కొనసాగుతుందో అందరికీ తెలిసిందే. రోజుకు లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వాలు ముమ్మర చర్యలు చేపడుతున్నాయి. ముఖ్యంగా ముఖ్యంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత పెంచుతున్నాయి. యూపీ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.

 ఆయన ట్విట్టర్ లో ఓ వీడియో పోస్ట్ చేస్తూ తాను రోజు గో మూత్రం తాగుతానని అందుకే తనకు కరోనా సోకడం లేదని తెలిపారు. ప్రతి రోజు ఉదయం..చల్లటినీటిలో ఐదు మూతల గోవు మూత్రం వేసి..పరిగడుపున తాగుతానని, తాగిన తర్వాత.. రోజూ మీ అందరి మధ్య 18 గంటలు పాటు నిరంతరం ఉంటానని, అయినప్పటికి కరోనా సోకడం లేదని ఆయన అన్నారు. ప్రస్తుతం ఈయన చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయినా నాకు కరోనా సోకడం లేదని చెప్పడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: