కరోనా వైరస్‌ మహమ్మారి ఇప్పటికే పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రముఖులను బలితీసుకుంది. తాజాగా, కోవిడ్-19తో మరో నేత ప్రాణాలు కోల్పోయారు. ప్రముఖ కాంగ్రెస్‌ నేత, రాజస్థాన్‌ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్‌ పహాడియా (89) కన్నుమూశారు. కరోనా బారినపడిన ఆయన చికిత్స పొందుతూ మరణించినట్లు హాస్పిటల్‌ వర్గాలు పేర్కొన్నాయి.  కరోనా సోకిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.  జగన్నాథ్ పహాడియా మృతిపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలిపారు. జగన్నాథ్ పహాడియా అంత్యక్రియలను గురువారం సాయంత్రం ప్రభుత్వం లాంఛనాలతో నిర్వహించనున్నారు. 1980-81 మధ్య రాజస్థాన్ ముఖ్యమంత్రిగా, హరియాణా, బిహార్ గవర్నర్‌గానూ పహాడియా సేవలందించారు. నాలుగు సార్లు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రిగానూ పనిచేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: