దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే. అయితే నిన్న కాస్త తగ్గిన కేసులు ఈరోజు మళ్ళీ పెరిగాయి. నిన్న మొన్నటి వరకు 4వేలకు పైగా మరణాలు కూడా రికార్డు కాగా తాజాగా నాలుగువేలకు దిగువకు చేరాయి. గడిచిన 24 గంటల్లో 2,11,298 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్తగా 2,83,135 మంది బాధితులు రికవరీ అయ్యారని పేర్కొంది.


ఇక  వైరస్‌ బారినపడి కొత్తగా 3,847 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,73,69,093కి పెరగగా.. మొత్తం 2,46,33,951 మంది కోలుకున్నారు. ఇక దేశంలో 24,19,907 యాక్టివ్‌ కేసులున్నాయని పేర్కొంది. ఇక ఇప్పటి దాకా 20,26,95,874 డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: